Cheyutha Pensions | అక్రమాలకు అడ్డుకట్ట.. లబ్ధిదారుల ఖాతాల్లోనే ‘చేయూత’ పెన్షన్లు జమ..!
Cheyutha Pensions | రాష్ట్రంలోని 42 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు చేయూత పథకం కింద పెన్షన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే.
Cheyutha Pensions | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని 42 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు చేయూత పథకం కింద పెన్షన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని లబ్ధిదారులు సదరు అధికారులకు భారీగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో నగదు చెల్లింపులు చేయకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో లబ్ధిదారులకు ఎంతో మేలు జరగనుంది. అక్రమాలకు ఆస్కారమే లేకుండా పోతుందని అధికారులు నిర్ణయించారు.
అయితే చేయూత పెన్షన్లు పొందుతున్న కొందరికి నేరుగా బ్యాంకు ఖాతాలోనే సొమ్ము జమ అవుతుంది. కానీ కొంత మంది లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు పెన్షన్లను అందిస్తున్నారు. ఈ నగదు చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే అన్ని పింఛన్లు లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించింది. నగదు తీసుకుంటున్న వారికి కొత్తగా పోస్టల్ బ్యాంకు ఖాతాలు తెరిచి జమ చేయాలని నిర్ణయించింది. వీటిలో జమయ్యే సొమ్మును లబ్ధిదారులు తమకు అవసరమైనప్పుడు నేరుగా లేదంటే ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చు. ప్రస్తుతం లైవ్ అథెంటికేషన్ పేరిట లబ్ధిదారుల నిర్ధారణ కార్యక్రమం జరుగుతోంది. జూన్ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని, ఆగస్టు నుంచి పింఛను మొత్తాలు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేసే అవకాశముందని సమాచారం.
సంబంధిత వార్తలు

Nagam Janardhan Reddy | ఏదుల నుంచి డిండికి నీళ్లు తరలిస్తే.. మరో ఉద్యమం తప్పదు.. రేవంత్ సర్కార్‌కు నాగం హెచ్చరిక
జూన్ 4, 2026

MJPTBCWRIES | 5 నుంచి బీసీ గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ.. వివరాలివే..!
జూన్ 4, 2026

TG TET | 30 వేల మంది టీచర్లు ‘టెట్’ ఫెయిల్..! ఈ సారైనా ఉత్తీర్ణత సాధించేనా..?
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●MJPTBCWRIES | 5 నుంచి బీసీ గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ.. వివరాలివే..!
- ●TG TET | 30 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్..! ఈ సారైనా ఉత్తీర్ణత సాధించేనా..?
- ●Horoscope | జూన్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

MJPTBCWRIES | 5 నుంచి బీసీ గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ.. వివరాలివే..!

TG TET | 30 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్..! ఈ సారైనా ఉత్తీర్ణత సాధించేనా..?

Horoscope | జూన్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!



