త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG TET | 30 వేల మంది టీచ‌ర్లు ‘టెట్’ ఫెయిల్..! ఈ సారైనా ఉత్తీర్ణ‌త సాధించేనా..?

TG TET | ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాలంటే టీచ‌ర్ ఎలిజ‌బిలిటీ టెస్ట్(టెట్‌) త‌ప్ప‌నిస‌రిగా ఉత్తీర్ణ‌త సాధించాలి. అప్పుడే డీఎస్సీకి అర్హ‌త సాధించిన వార‌వుతారు.

S

Telangana | Published On Jun 4, 2026, 6.51 am IST

TG TET | 30 వేల మంది టీచ‌ర్లు ‘టెట్’ ఫెయిల్..! ఈ సారైనా ఉత్తీర్ణ‌త సాధించేనా..?
Advertisement

TG TET | త్రినేత్ర‌.న్యూస్ : ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాలంటే టీచ‌ర్ ఎలిజ‌బిలిటీ టెస్ట్(టెట్‌) త‌ప్ప‌నిస‌రిగా ఉత్తీర్ణ‌త సాధించాలి. అప్పుడే డీఎస్సీకి అర్హ‌త సాధించిన వార‌వుతారు. టెట్ నిర్వ‌హ‌ణ కంటే ముందే డీఎస్సీ ఉద్యోగం పొందిన టీచ‌ర్ల‌లో చాలా మంది టెట్ ఉత్తీర్ణ‌త సాధించ‌లేదు. ఇన్ స‌ర్వీస్ టీచ‌ర్లు కూడా వ‌చ్చే రెండేళ్ల‌లో టెట్ ఉత్తీర్ణ‌త సాధించాల్సిందేన‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్ట‌మైన ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వ‌హిస్తున్నారు. ఇన్ స‌ర్వీస్ టీచ‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని ఏడాదికి నాలుగుసార్లు టెట్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో విద్యాశాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా బుధ‌వారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అదనపు టెట్‌ నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

30 వేల మంది టీచ‌ర్లు టెట్ ఫెయిల్..!

రాష్ట్రంలో ఇప్ప‌టికీ 30 వేల మంది టీచ‌ర్లు టెట్ ఫెయిల్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి టెట్ ఎగ్జామ్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఈ సారి టెట్‌కు మొత్తం 1.37 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, ఇందులో 28,149 మంది ఇన్ స‌ర్వీస్ టీచ‌ర్లు ఉన్న‌ట్లు తేలింది. వీరంతా ఈ సారైనా పాస్ అయ్యేనా..? అన్న ప్ర‌శ్న ప‌లువురిలో మెదులుతుంది.

జ‌న‌వ‌రిలో నిర్వ‌హించిన టెట్‌లో 37 వేల మంది టీచ‌ర్లు పాస్

ఈ ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో నిర్వ‌హించిన టెట్‌కు 65,605 మంది ఉపాధ్యాయులు హాజ‌ర‌య్యారు. వీరిలో 42.24 శాతం మంది అంటే 27,712 మంది టీచ‌ర్లు ఫెయిల‌య్యారు. మిగిలి 37,803 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంత పెద్ద‌సంఖ్య‌లో (57.76 శాతం) ఉపాధ్యాయులు అర్హ‌త సాధించ‌డం ఇదే మొద‌టిసారికావ‌డం గ‌మ‌నార్హం.

 

Advertisement
Advertisement