త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harishrao | ఎంబీబీఎస్ విద్యార్థుల‌కు చెక్కుల పంపిణీ.. అంద‌జేసిన హ‌రీశ్‌రావు

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshmareddy) గారి ఆధ్వర్యంలో హ‌రీశ్‌రావు (Harishrao) నివాసంలో ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల(MBBS Students) కు చెక్కులు అందజేశారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌కు హ‌రీశ్‌రావు అభినందనలు తెలియజేశారు.

S

Telangana | Published On Mar 3, 2026, 6.26 pm IST

Harishrao | ఎంబీబీఎస్ విద్యార్థుల‌కు చెక్కుల పంపిణీ.. అంద‌జేసిన హ‌రీశ్‌రావు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshmareddy) ఆధ్వర్యంలో హ‌రీశ్‌రావు (Harishrao) నివాసంలో ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల(MBBS Students) కు చెక్కులు అందజేశారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌కు హ‌రీశ్‌రావు అభినందనలు తెలియజేశారు. BLR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య విద్యార్థులకు చెక్కులు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

అనంత‌రం హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) దూరదృష్టి నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల స్థాపనతో “వైట్ కోట్ విప్లవం” సాకారమైందని చెప్పారు. దీంతో వైద్య విద్య అవకాశాలు విస్తరించాయ‌ని వివరించారు. ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. ఇది కేవలం దానంగా కాకుండా, భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడిగా భావించాల్సిన అంశమని ఆయన తెలిపారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే ప్రతిభావంతమైన యువతను ప్రోత్సహిస్తూ, విద్య ద్వారా సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, BRS పార్టీ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ ముదిరాజ్, నాయకులు మహేష్ గౌడ్, వంజరి ప్రవీణ్, కరిపే పిల్లి నాగరాజు, బోసాని పవన్ కుమార్, దయాకర్ రెడ్డి, శ్రవణ్, రఘువరన్, నాని, రాజేష్ గౌడ్, కడిగే శేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement