త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఆ తెలివితేట‌లు లేవు నాకు.. అందుకే న‌న్ను అహంకారి అంటారేమో : కేటీఆర్

KTR | కడుపులో కత్తులు పెట్టుకుని.. పెదవులపై చిరునవ్వులు పెట్టుకునే తెలివితేటలు తనకు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అందుకే తనకు అహంకరమని అంటారేమో అని ఆయ‌న అన్నారు.

S

Telangana | Published On Jun 3, 2026, 3.42 pm IST

KTR | ఆ తెలివితేట‌లు లేవు నాకు.. అందుకే న‌న్ను అహంకారి అంటారేమో : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : కడుపులో కత్తులు పెట్టుకుని.. పెదవులపై చిరునవ్వులు పెట్టుకునే తెలివితేటలు తనకు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అందుకే తనకు అహంకరమని అంటారేమో అని ఆయ‌న అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. మీకు అహంకారమని అంతా అనుకుంటారని ఇంటర్వ్యూల్లో చెప్పారు కదా.. దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా..? అని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అమ‌ర్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఈ విధంగా బ‌దులిచ్చారు.

నాకు అహంకారమని అంతా ఎందుకు అనుకుంటారని కచ్చితంగా ఆలోచిస్తుంటాను. అయితే కొంతమందికి కొన్ని కొన్ని మ్యాన్యుఫ్యాక్షరింగ్ డిఫెక్ట్ ఉంటాయి. అలాగే తనకు బాడీ లాంగ్వేజ్ సమస్య ఉంది. అందుకే నవ్వుతూ మాట్లాడమని మిత్రులు చెబుతుంటారని.. కానీ అలా లేని నవ్వు తెచ్చుకుని నాకు మాట్లాడటం రాదు. తెలంగాణ వాడిని కదా.. కడపులో కత్తులు, పెదవులపై చిరునవ్వులు పెట్టుకునే తెలివితేటలు తనకు లేవని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

కొన్ని సందర్భాల్లో నిజం నిక్కచ్చిగా చెబితే ఎవరికీ నచ్చదు. నేను ఎక్కడ అహంకారం చూపించానో.. ఒక ఉదంతం చూపించమంటే ఎవరూ చెప్పరు. కానీ నీకు అహంకారం ఎక్కువ అని అంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికీ నచ్చదు కదా అందుకే అహంకారం అనుకుంటున్నారు. వాళ్ల మాటలు నాకు కూడా అలవాటైపోయాయని కేటీఆర్ న‌వ్వుతూ బ‌దులిచ్చారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement