త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | బాల్క సుమ‌న్ మాట్లాడింది పొర‌పాటే : కేటీఆర్

KTR | మిలిటెంట్ పోరాటాలు చేయాల‌ని మా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ మాట్లాడి ఉంటే పొర‌పాటే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

S

Telangana | Published On Jun 3, 2026, 1.14 pm IST

KTR | బాల్క సుమ‌న్ మాట్లాడింది పొర‌పాటే : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : మిలిటెంట్ పోరాటాలు చేయాల‌ని మా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ మాట్లాడి ఉంటే పొర‌పాటే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిచ్చారు. మిలిటెంట్ పంథాను ఎంచుకున్నారా..? అని అడిగి ప్ర‌శ్న‌కు కేటీఆర్ ఇలా బ‌దులిచ్చారు.

మా పార్టీ పంథా మార‌లేదు. శాంతియుత ప‌ద్ధ‌తిలో తెలంగాణ సాధించాల‌నే దృక్ప‌థం పోయాం. ఇవాళ కూడా శాంతియుత ప‌ద్ధ‌తుల్లోనే నిర‌స‌న తెలుపుతున్నాం. మాజీ ఎమ్మెల్యే బాల్క‌ సుమ‌న్ పొరపాటుగా మాట్లాడారు. అందులో అనుమానం అక్క‌ర్లేదు. అయితే మిలిటెన్సీ స్పిరిట్‌తో ప‌ని చేయాల‌ని అని ఉండొచ్చు. మిలిటెంట్ పోరాటాలు అని ఉంటే త‌ప్పు.. సుమ‌న్ వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌వించే స‌మ‌స్య‌నే లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

అయితే సుమ‌న్‌ను జైల్లో పెట్టారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే.. హ‌రీశ్‌రావు క్యాంపు ఆఫీస‌ను త‌గ‌ల‌బెడుతా అన్నారు. గ‌జ్వేల్ క్యాంపు ఆఫీసు కూడా త‌గుల‌బెడుతా అన్నారు. కేసు పెట్టారా..? ఫార్మా కంపెనీని త‌గ‌ల‌బెడుతామ‌ని జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. ఏం యాక్ష‌న్ తీసుకున్నారు. మొన్న ఒక ఎమ్మెల్యే చేయి న‌రికేస్తా అన్నారు. ఏం చ‌ర్య‌లు తీసుకున్నారు. జస్టిస్ అయినా, లా అండ్ ఆర్డ‌ర్ అయినా సెలెక్టివ్‌గా ఉంటే కుద‌ర‌దు. బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మ‌రి కేసులు పెట్ట‌రా..? మ‌రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడే భాష మీద ఎన్ని కేసులు పెట్టాలి. లా అండ‌ర్ ఆర్డ‌ర్ అంద‌రికీ ఒక‌టే ఉండాలి అని కేటీఆర్ అన్నారు.

Advertisement
Advertisement