Bhagirath Case | హైడ్రామాకు ఫుల్‌స్టాప్ పెట్టండి.. బండి తనయుడి కేసులో డీజీపీకి బీఆర్ఎస్ నేతల రిక్వెస్ట్..!
Bhagirath Case | కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ మహిళా నేతలు డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఈ కేసు అంశంపై తాము డీజీపీని కలిశామని తెలిపారు.
Bhagirath Case | కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ మహిళా నేతలు డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఈ కేసు అంశంపై తాము డీజీపీని కలిశామని తెలిపారు. “ఈ హైడ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరాం. సాధారణులకు ఒక విధంగా, మంత్రుల కుటుంబాలకు మరో విధంగా న్యాయం జరుగుతుందా” అని ప్రశ్నించారు. నిందితుడు ఇన్ని రోజులు అయినా అరెస్ట్ కాకపోవడం దుశ్చర్య అని వ్యాఖ్యానించారు. పోక్సో కేసులో అరెస్ట్ కావాల్సిన నిందితుడు తప్పించుకు తిరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. నిందితుడిపై స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్లు పెట్టారని, ప్రభుత్వ ఒత్తిడి పోలీస్ శాఖపై ఉందని తాము అనుమానిస్తున్నామని తెలిపారు. దాదాపు ఆరు నెలలుగా ఈ వ్యవహారం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.
హోంమంత్రిగా రేవంత్ విఫలం..
రాష్ట్రంలో హోం శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా విఫలమయ్యారని సత్యవతి రాథోడ్ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ మహిళా మంత్రులు కూడా మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ తన కుమారుడిని లొంగదీసుకోవాలని, తన తప్పును ఒప్పుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. బండి సంజయ్‌ను కూడా నిందితుడిగా చేర్చాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. నిందితుడు పరారీలో ఉంటే అతని బంధువులను అదుపులోకి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.
బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి..
తుల ఉమా మాట్లాడుతూ తన కుమారుడిని కాపాడుకునేందుకు బండి సంజయ్ వివిధ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని, బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కాపాడడం కూడా నేరమేనని అన్నారు. గొంగిడి సునీత మాట్లాడుతూ, పోలీసులు నిందితుడి మేనమామకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ కేసులో బండి సంజయ్, సంగప్ప కూడా నిందితులేనని ఆరోపిస్తూ, మైనర్ బాలికపై, ఆమె కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం జరిగిందని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు. పేట్ బషీర్బాద్ పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, సెక్షన్లను మార్చి నిందితులను కాపాడుతున్నారని విమర్శించారు. ఈ విషయంపై బీఆర్‌ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని నేతలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరూ స్పందించడంలేదని ఆరోపించారు. గతంలో ఒక ఘటనపై మాట్లాడిన మంత్రి సీతక్క ఇప్పుడు మౌనం వహిస్తున్నారని మహిళా నేతలు విమర్శించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



