Ramachander Rao | రేవంత్ రెడ్డి సర్కార్ గడ్డపార సర్కార్.. రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు
Ramachander Rao | తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ గడ్డపార సర్కార్ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్లను కూలగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు హిందూ దేవాలయాలు, పవిత్ర మఠాలపై కన్నేసింది. శారదా పీఠం లాంటి ధార్మిక సంస్థల జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయన హెచ్చరించారు.
Ramachander Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ గడ్డపార సర్కార్ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్లను కూలగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు హిందూ దేవాలయాలు, పవిత్ర మఠాలపై కన్నేసింది. శారదా పీఠం లాంటి ధార్మిక సంస్థల జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయన హెచ్చరించారు. కోకాపేట్‌లోని శారదా పీఠాన్ని తరలించాలని యోచిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదనపై రామచందర్ రావు సందేశం విడుదల చేశారు.
కోకాపేట్ నియో పోలిస్‌లో గత ప్రభుత్వం శారదా పీఠం, రాజశ్యామల మందిరానికి 2 ఎకరాల భూమి ఇచ్చింది. ఈ ఆలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ గడ్డపార సర్కార్ అయిందని బీజేపీ పార్టీ మొదట్నుంచి చెబుతూ వస్తుంది. హైడ్రా పేరు మీద హైదరాబాద్‌లో ఇండ్లు కూలగొట్టడం, మూసీ సుందరీకరణ పేరుతో వేలాది మందిని నిరాశ్రయులను చేస్తున్నారు. ఖమ్మంలో ఇండ్లను కూలగొట్టారు. వీటితో పాటు జూబ్లీహిల్స్‌లో ఆలయాలను కూలగొట్టడం జరిగింది. ఇవాళ హిందువులకు సంబంధించిన మఠాన్ని కూడా కూలగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇది కేవలం రేవంత్ స్వార్థమే. శారదా పీఠం జోలికి వస్తే బీజేపీ తప్పకుండా ఉద్యమిస్తది. హిందూ సంస్థలు, దేవాలయాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తుంది. మజ్లిస్ పార్టీతో దోస్తీ కోసం ఇలా చేస్తున్నారా..? లేక ముస్లింలను సంతృప్తి పరిచేందుకు ఇలా చేస్తున్నారా..? హిందూ ధర్మాన్ని ప్రబోధించే వేద పాఠశాల కూడా అక్కడుంది. ఇలాంటి చర్యలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పేదలకు అన్నం పెట్టే మఠాలను దెబ్బతీయాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు అని రామచందర్ రావు హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



