త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MBBS Seats | ప్రైవేట్‌లో 700, గ‌వ‌ర్న‌మెంట్‌లో 110.. రాష్ట్రంలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు

MBBS Seats | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో మెడిసిన్ (Medicine Courses) చేయాల‌నుకునే విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌. కొత్త‌గా 800కిపైగా ఎంబీబీఎస్‌ సీట్లు (MBBS Seats) అందుబాటులోకి రానున్నాయి. ఇ

G

Telangana | Published On Jul 16, 2026, 6.29 am IST

MBBS Seats | ప్రైవేట్‌లో 700, గ‌వ‌ర్న‌మెంట్‌లో 110.. రాష్ట్రంలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు
Advertisement

MBBS Seats | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో మెడిసిన్ (Medicine Courses) చేయాల‌నుకునే విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌. కొత్త‌గా 800కిపైగా ఎంబీబీఎస్‌ సీట్లు (MBBS Seats) అందుబాటులోకి రానున్నాయి. ఇవి ప్ర‌స్తుత (2026-27) విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. తాజాగా పెరిగిన సీట్ల‌లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు 110, ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలకు 600, డీమ్డ్‌ వైద్య విశ్వవిద్యాలయ కళాశాలకు 100 చొప్పున ఉన్నాయి. మొత్తంగా 810 అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (NMC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ సీట్లు కూడా ఈ ఏడాది నీట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ కానున్నాయి. 2025-26 వైద్య సంవత్సరానికి రాష్ట్రంలో 8,840 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉండగా.. పెరిగిన ఈ సీట్లతో రాష్ట్రంలో మొత్తం వైద్య సీట్ల సంఖ్య 9,650కి పెరిగింది.

పెరిగిన సీట్లు ఇలా..

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ- 25
సిద్దిపేట గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ- 25
నిజామాబాద్ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ- 30
రిమ్స్ ఆదిలాబాద్‌- 30

భాస్క‌ర్ మెడిక‌ల్ కాలేజీ- 50
మ‌మ‌తా అకాడ‌మీ- 50
ఎస్‌వీఎస్ మెడిక‌ల్ కాలేజీ- 50
మ‌హేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజీ- 100
ఎంఎన్ఆర్ మెడిక‌ల్ కాలేజీ- 100
షాద‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌- 100
రాజ‌రాజేశ్వ‌రి ఇన్‌స్టిట్యూట్ (మ‌హిళా కాలేజీ)- 150

మ‌ల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌- 50
మ‌ల్లారెడ్డి మ‌హిళా మెడిక‌ల్ కాలేజీ- 50

Advertisement
Advertisement