త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Spotify | స్పాటిఫై గుడ్ న్యూస్‌.. భారీగా సబ్‌స్క్రిప్షన్ ధ‌ర‌ల త‌గ్గింపు..

Spotify | భార‌త్‌లో ఉన్న సంగీత ప్రియుల‌కు ప్ర‌ముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై (Spotify) గుడ్ న్యూస్ చెప్పింది. తన ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా స్టూడెంట్స్, ఇండివిడ్యువల్ యూజర్లను టార్గెట్ చేస్తూ యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత అందుబాటులోకి తీసుకువచ్చింది.

S

Technology | Published On May 15, 2026, 12.46 pm IST

Spotify | స్పాటిఫై గుడ్ న్యూస్‌.. భారీగా సబ్‌స్క్రిప్షన్ ధ‌ర‌ల త‌గ్గింపు..
Advertisement

Spotify | భార‌త్‌లో ఉన్న సంగీత ప్రియుల‌కు ప్ర‌ముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై (Spotify) గుడ్ న్యూస్ చెప్పింది. తన ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా స్టూడెంట్స్, ఇండివిడ్యువల్ యూజర్లను టార్గెట్ చేస్తూ యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం ఆరు నెలల క్రితమే స్టాండర్డ్, లైట్, ప్లాటినమ్ మోడల్‌ల‌ను తీసుకొచ్చిన స్పాటిఫై.. ఇప్పుడు మరోసారి ధరల్లో భారీ మార్పులు చేసింది. అంతకుముందు 2019లో ఇండియాలో లాంచ్ అయిన తర్వాత మొదటిసారి గతేడాది ఆగస్టులో ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ధరలు తగ్గించడం ద్వారా స్పాటిఫై తన లైట్, స్టాండర్డ్ ప్లాన్‌లను విలీనం చేసినట్టుగా తెలిపింది. దీంతో యూజర్లకు తక్కువ ధరలోనే పూర్తి ప్రీమియం ఫీచర్లు అందనున్నాయి. ఇందులో ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్, 320కేబీపీఎస్ హై క్వాలిటీ ఆడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త ధరలు ఇవే..

స్టూడెంట్‌ ప్లాన్ ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కు రూ.99 ఉండ‌గా ఇప్పుడ‌ది 30 శాతం త‌గ్గి రూ.69కే ల‌భిస్తోంది. ఇక వ్య‌క్తిగ‌త ప్లాన్ నెల‌కు రూ.199 ఉండ‌గా, ఇది కూడా 30 శాతం మేర త‌గ్గింది. దీంతో ఈ ప్లాన్‌ను రూ.139కే పొంద‌వ‌చ్చు. ప్లాటినం ప్లాన్‌కు మాత్రం ఎలాంటి మార్పు చేయ‌లేదు. దీని ధ‌ర‌ను త‌గ్గించ‌లేదు. య‌థాప్ర‌కారం నెల‌కు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు రూ.139 లైట్ ప్లాన్‌లో ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్, హై క్వాలిటీ ఆడియో వంటి ఫీచర్లు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఇప్పుడు అదే ధరకు పూర్తి స్టాండర్డ్ ప్రీమియం ఫీచర్లు లభించనున్నాయి. దీంతో యూజర్లకు అదనపు ఖర్చు లేకుండానే భారీ ఫీచర్ అప్‌గ్రేడ్ దక్కినట్టైంది. రూ.69 స్టూడెంట్ ప్లాన్‌తో స్పాటిఫై ఇప్పుడు యువతను మరింత ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో జియో సావ‌న్‌, యూట్యూబ్ మ్యూజిక్ వంటి ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

కొత్తగా సబ్‌స్క్రైబ్ అయ్యే యూజర్లకు ఈ ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే పాత రూ.199 ఇండివిడ్యువల్ ప్లాన్‌లో ఉన్నవారిని స్పాటిఫై వచ్చే బిల్లింగ్ సైకిల్‌లో ఆటోమేటిక్‌గా కొత్త రూ.139 ప్లాన్‌కు మార్చ‌నుంది. లేకపోతే యాప్ సెట్టింగ్స్‌లో స్విచ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దాంతోనూ యూజ‌ర్లు మాన్యువ‌ల్ గా ప్లాన్‌కు మార‌వ‌చ్చు.

Advertisement
Advertisement