Jio | జియో ప్రీపెయిడ్ ప్లాన్లలో అదిరే ఆఫర్.. అదనంగా 20జీబీ డేటా ఫ్రీ..
Jio | భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు అదనపు డేటా ప్రయోజనం అందిస్తోంది. ఒక్కటి కాదు, రెండు కాదు.. మొత్తం ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లలో ఎక్స్‌ట్రా హైస్పీడ్ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
Technology | Published On Jul 24, 2026, 3.10 pm IST
Jio | భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు అదనపు డేటా ప్రయోజనం అందిస్తోంది. ఒక్కటి కాదు, రెండు కాదు.. మొత్తం ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లలో ఎక్స్‌ట్రా హైస్పీడ్ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా రూ.900లోపు అందుబాటు ధరల ప్లాన్లలోనే ఈ ప్రయోజనం లభిస్తోంది. జియో రూ.459 ప్లాన్ నుంచి రూ.899 ప్లాన్ వరకు అదనపు డేటాను అందిస్తోంది. ఆ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. జియో రూ.459 ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2జీబీ మొబైల్ డేటాతోపాటు అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. దీంతో మొత్తం 61జీటీ డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు అందిస్తారు. అర్హులైన వినియోగదారులకు అపరిమిత 5జి డేటా కూడా లభిస్తుంది. అదనంగా ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
రూ.495 ప్లాన్‌లో..
రూ.495 ప్లాన్ లో కూడా అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, రోజుకు 1.5జీబీ డేటాతో పాటు అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులు. ఇతర అదనపు ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. రూ.545 ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, రోజుకు 2జీబీ డేటాతో పాటు అదనంగా 5జీబీ డేటా అందిస్తారు. అర్హులైన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇతర ప్రయోజనాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.
రూ.749 ప్లాన్‌లో..
రూ.749 ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2జీబీ డేటాతోపాటు అదనంగా 20జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులు. అలాగే జియోహాట్‌స్టార్ మొబైల్‌తో పాటు ఇతర యాప్‌ల సబ్‌స్క్రిప్షన్లను కూడా ఉచితంగా అందిస్తారు. రూ.899 ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు అదనంగా 20జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. అలాగే పలు ఇతర ప్రయోజనాలను కూడా జియో ఈ ప్లాన్‌లో అందిస్తోంది.
తాజావార్తలు
- ●Sreemukhi | శ్రీముఖి క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Minister Ponnam Prabhakar | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
- ●BRS Party | బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖ ప్రారంభం.. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
- ●Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు
- ●OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ - తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
- ●Minister Seethakka | పట్నం రోడ్లకు తీసిపోకుండా పల్లె రోడ్లు : మంత్రి సీతక్క

Sreemukhi | శ్రీముఖి క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!

Minister Ponnam Prabhakar | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు

BRS Party | బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖ ప్రారంభం.. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు






