Phone Hacking Alert | మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? ఒక్క కోడ్‌తో 2 సెకన్లలో తెలుసుకోండిలా.. ఇలా చేస్తే సేఫ్..!
మీ కాల్స్, మెసేజ్‌లు, బ్యాంక్ ఓటీపీలు (OTPs) మీకు తెలియకుండానే వేరే వాళ్లకి వెళ్తున్నాయా? మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో అనే అనుమానం ఉందా? అయితే వెంటనే ఈ సీక్రెట్ కోడ్ డయల్ చేసి చెక్ చేసుకోండి. ప్రమాదం ఉంటే ఎలా ఆపాలో తెలుసుకోండి.
Technology | Published On Feb 11, 2026, 12.08 pm IST
Phone Hacking Alert | ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడకం ఎంత పెరిగిందో, సైబర్ నేరాలు కూడా అంతే పెరిగాయి. మనకు తెలియకుండానే మన ఫోన్ కాల్స్ (Calls), మెసేజ్‌లు (SMS), ముఖ్యమైన బ్యాంక్ ఓటీపీలు (OTPs) వేరే నంబర్‌కు ఫార్వర్డ్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల మన బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే, మీ ఫోన్ సురక్షితంగా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి టెక్ నిపుణులు రెండు సింపుల్ కోడ్స్ సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? (Dial *#21#)
మీ ఫోన్ కాల్స్ లేదా డేటా వేరే ఎవరికైనా ఫార్వర్డ్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ కోడ్ ఉపయోగపడుతుంది. ముందుగా మీ మొబైల్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. *#21# ( స్టార్-హ్యాష్-21-హ్యాష్) అని టైప్ చేసి కాల్ చేయండి. కొద్ది సెకన్లలో మీ స్క్రీన్ పై ఒక మెసేజ్ వస్తుంది. అందులో "Not Forwarded" అని వస్తే మీ ఫోన్ సేఫ్ అని అర్థం. మీకు ఎలాంటి భయం అవసరం లేదు. ఒకవేళ అలా కాకుండా ఏదైనా మొబైల్ నంబర్ గానీ, "Forwarded" అని గానీ వస్తే మాత్రం మీ కాల్స్, మెసేజ్‌లు వేరే వారికి వెళ్తున్నాయని అర్థం. వెంటనే అప్రమత్తం అవ్వాలి.
హ్యాకింగ్ లేదా కాల్ ఫార్వార్డింగ్‌ను ఆపడం ఎలా? (Dial ##002#)
పైన చెప్పిన విధంగా చెక్ చేసినప్పుడు, మీ కాల్స్ వేరే నంబర్‌కి వెళ్తున్నట్లు అనిపిస్తే, వెంటనే దాన్ని ఆపేయాలి. దానికోసం ఈ కోడ్ వాడండి. మీ మొబైల్ లో ##002# (హ్యాష్-హ్యాష్-002-హ్యాష్) అని టైప్ చేసి డయల్ చేయండి. వెంటనే మీకు "All error Successful" లేదా "All forwarding cancelled" అనే మెసేజ్ వస్తుంది. దీని అర్థం, మీ ఫోన్ లో ఉన్న అన్ని రకాల కాల్ ఫార్వార్డింగ్ సెట్టింగ్స్ తొలగించబడ్డాయని. ఇలా చేయడం వల్ల మీ ఎస్ఎంఎస్ (SMS), బ్యాంక్ ఓటీపీలు సురక్షితంగా ఉంటాయి. హ్యాకర్ల బారిన పడకుండా ఉంటారు. తరచూ ఈ కోడ్స్ ద్వారా మీ ఫోన్ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. ఇది మీ వ్యక్తిగత భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●US Visitor Visa Hyderabad | అమెరికా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏడాది ఆగాల్సిందే.. హైదరాబాద్‌లోనే అత్యధిక వెయిటింగ్ పీరియడ్
- ●Mobile Number Leak Signs | తరచూ స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయా? మీ ఫోన్ నంబర్ హ్యాక్ అయినట్టే.. సేఫ్టీ కోసం వెంటనే ఇలా చేయండి
- ●Medigadda Barrage Repair | మేడిగడ్డ బ్యారేజీకి ఎండ్ టు ఎండ్ డయాఫ్రం వాల్
- ●Festive Season Appliance Price Hike | పండక్కి ఆఫర్లా.. వాతలా? వినియోగదారులకు ఊహించని షాక్.. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీల ధరలు పైపైకి
- ●Virat Kohli | కోహ్లీ మరో చరిత్ర.. వన్డేల్లో 15 వేల పరుగులు.. సచిన్ రికార్డుపైనే కన్ను..!
- ●Pink Power Run 3.0 | నెక్లెస్ రోడ్డుపై 35 వేల మందితో పరుగుల పండగ: రొమ్ము క్యాన్సర్‌పై పోరుకు హైదరాబాద్ పింక్ పవర్ రన్ 3.0

US Visitor Visa Hyderabad | అమెరికా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏడాది ఆగాల్సిందే.. హైదరాబాద్‌లోనే అత్యధిక వెయిటింగ్ పీరియడ్

Mobile Number Leak Signs | తరచూ స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయా? మీ ఫోన్ నంబర్ హ్యాక్ అయినట్టే.. సేఫ్టీ కోసం వెంటనే ఇలా చేయండి

Medigadda Barrage Repair | మేడిగడ్డ బ్యారేజీకి ఎండ్ టు ఎండ్ డయాఫ్రం వాల్

Festive Season Appliance Price Hike | పండక్కి ఆఫర్లా.. వాతలా? వినియోగదారులకు ఊహించని షాక్.. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీల ధరలు పైపైకి



