త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanju Samson | ఐపీఎల్‌లో 5వేల ప‌రుగుల క్ల‌బ్‌లో సంజు శాంస‌న్‌..

Sanju Samson | గుజ‌రాత్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే ఔట్ అయినా, సంజూ శాంసన్ ఐపీఎల్‌లో 5వేల ప‌రుగులు చేసి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. చెపాక్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరాడు.

P

Sports | Published On Apr 26, 2026, 6.51 pm IST

Sanju Samson | ఐపీఎల్‌లో 5వేల ప‌రుగుల క్ల‌బ్‌లో సంజు శాంస‌న్‌..
Advertisement

Sanju Samson | చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజు శాంస‌న్ ఐపీఎల్‌లో 5వేల ప‌రుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం శాంసన్ రాణించలేకపోయారు. కేవలం 11 పరుగులు చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. ఈ ఇన్నింగ్స్‌లో రెండు బౌండరీలు బాది.. ఐపీఎల్‌లో 5వేల ప‌రుగులు చేసి బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరాడు. అదే సమయంలో తక్కువ బంతుల్లో 5వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా శాంసన్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియ‌ర్స్ 3,288 బంతుల్లో ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆ త‌ర్వాత డేవిడ్ వార్న‌ర్ 3,554 బంతులతో రెండో స్థానంలో నిలువ‌గా.. శాంసన్ 3,555 బంతుల్లో ఈ మైలురాయిని చేరాడు. ఆ త‌ర్వాతి స్థానంలో సురేష్ రైనా (3,620 బంతులు), కేఎల్ రాహుల్ (3,688 బంతులు), ఎంఎస్ ధోనీ (3,691 బంతులు) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, గుజరాత్‌కు తొలి వికెట్‌ను క‌సిగో ర‌బాడా అందించాడు. నాలుగో ఓవర్ మూడో బంతికి శాంసన్‌ను ఔట్ చేసి గుజరాత్‌కు శుభారంభం ఇచ్చాడు. ఈ క్యాచ్‌ను జోస్ బ‌ట్ల‌ర్ అందుకున్నాడు. టీ20ల్లో రబడా చేతిలో శాంసన్ ఔటవడం ఇదే మూడోసారి. ఐదు ఇన్నింగ్స్‌లలో రబడా బౌలింగ్‌లో శాంసన్ 28 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సమయంలో ఆయన స్ట్రైక్‌రేట్ 132.14గా ఉంది.

Advertisement
Advertisement