MCC New Rules | ఆట స్వరూపమే మారేలా..! క్రికెట్‌లో కొత్త రూల్స్ తీసుకొచ్చిన ఎంసీసీ..!
MCC New Rules | మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఆట స్వరూపాన్నే మార్చే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026 ఎడిషన్ కోసం రూపొందించిన కొత్త క్రికెట్ చట్టాలను ప్రకటిస్తూ మొత్తం 73 సవరణలను ఆమోదించింది.
MCC New Rules | మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఆట స్వరూపాన్నే మార్చే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2026 ఎడిషన్ కోసం రూపొందించిన కొత్త క్రికెట్ చట్టాలను ప్రకటిస్తూ మొత్తం 73 సవరణలను ఆమోదించింది. ఈ రూల్స్ అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. మార్పుల్లో కీలకమైంది అమెచ్యూర్ క్రికెట్‌లో చౌక రకం బ్యాట్లకు అనుమతి ఇవ్వడం. ఇంగ్లిష్ విల్లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సాధారణ క్రీడాకారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంసీసీ ప్రకటించింది.
ఇప్పటివరకు జూనియర్ క్రికెట్‌కే పరిమితమైన ‘టైప్-డీ’, లామినేటెడ్ బ్యాట్లను ఇకపై ఓపెన్-ఏజ్ అమెచ్యూర్ క్రికెట్‌లోనూ ఉపయోగించుకునేందుకు ఎంసీసీ అవకాశం కల్పించింది. నిబంధన 5.8కి చేసిన ఈ సవరణతో తక్కువ ధరకు లభించే బ్యాట్లకు అధికారిక గుర్తింపు లభించింది. ఈ తరహా బ్యాట్లలో ముందుభాగంలో ఇంగ్లిష్ విల్లో పొర, వెనుక భాగంలో కశ్మీర్ విల్లో వంటి చౌక కర్రను అతికించి తయారు చేస్తారు. దాంతో బ్యాట్ ధర గణనీయంగా తగ్గుతుంది. అయితే ప్రొఫెషనల్, హై లెవెల్ క్రికెట్‌లో మాత్రం ఒకే కర్రతో తయారైన టైప్-ఏ, బీ, సీ బ్యాట్ల వాడకమే కొనసాగుతుందని ఎంసీసీ స్పష్టం చేసింది. బ్యాట్ తయారీదారులతో కలిసి విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ మార్పులను తీసుకువచ్చామని తెలిపింది. దాంతో అదనపు ప్రయోజనాలు ఉండవని ఎంసీసీ లాస్ మేనేజర్ ఫ్రేజర్ స్టీవార్ట్ పేర్కొన్నారు. దక్షిణాసియా నుంచి పెరిగిన డిమాండ్ కారణంగా ఇంగ్లిష్ విల్లో బ్యాట్ల ధరలు ఇటీవల మూడింతలు పెరిగాయి. కొన్ని ప్రీమియం బ్యాట్ల ధరలు వెయ్యి పౌండ్ల (సుమారు రూ.లక్ష ) దాకా చేరడంతో ఎంపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో గేమ్‌ను మరింత ఉత్కంఠ భరితంగా మార్చే పలు కీలక రూల్స్‌ను సైతం ఎంసీసీ మార్చింది.
చివరి ఓవర్ రూల్ : టెస్టులు, ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఆఖరి ఓవర్‌లో వికెట్ పడినా, ఆ ఓవర్ పూర్తయ్యే వరకూ ఆట కొనసాగాల్సిందే.
‘బన్నీ హాప్’ క్యాచ్‌లకు బ్రేక్ : బౌండరీ దాటి గాల్లోకి ఎగిరిన ఫీల్డర్ బంతిని ఒక్కసారి మాత్రమే గాల్లో తాకాలి. పూర్తిగా బౌండరీ లోపలికి వచ్చాకే క్యాచ్ పూర్తి చేయాలి. రెండోసారి గాల్లో తాకితే అది బౌండరీగా పరిగణలోకి తీసుకుంటారు.
వికెట్ కీపర్ గ్లోవ్స్ రూల్ : బౌలర్ రనప్ సమయంలో గ్లోవ్స్ స్టంప్స్ ముందు ఉండొచ్చు. కానీ బంతి రిలీజ్ చేసే క్షణంలో అవి తప్పనిసరిగా స్టంప్స్ వెనుకే ఉండాలి.
డిక్లరేషన్‌పై పరిమితి : మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అధికారం ఇకపై కెప్టెన్లకు ఉండదు.
బంతుల ప్రమాణీకరణ : మహిళల, జూనియర్ క్రికెట్‌లో వాడే బంతులకు పరిమాణం, బరువులో స్పష్టమైన ప్రమాణాలు నిర్దేశించారు. ఆటలో స్థిరత్వం కోసం మూడు వేర్వేరు సైజుల బంతులను ఖరారు చేశారు.
భాషా మార్పులు, సవరణలు
నియమావళిలో లింగ వివక్షకు తావులేని పదజాలాన్ని (జెండర్-న్యూట్రల్ లాంగ్వేజ్) చేర్చారు. ఇంగ్లిష్ మాతృభాష కానివారికి సులభంగా అర్థమయ్యేలా నిబంధనల్లోని పదజాలాన్ని సరళించారు. ఉద్దేశపూర్వకంగా రన్ వదిలేస్తే ఫీల్డింగ్ జట్టుకు పెనాల్టీ విధించడం, ఓవర్‌త్రోలకు, మిస్‌ఫీల్డ్‌లకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని నిర్వచించడం వంటి అనేక చిన్న సవరణలను చేశారు. 1787 నుంచి క్రికెట్ చట్టాలను పరిరక్షిస్తున్న ఎంసీసీ, ఈ తాజా సవరణలతో సంప్రదాయాన్ని కాపాడుతూ, ఆధునిక ఆట అవసరాలకు అనుగుణంగా క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



