Solar Eclipse | 17న ‘రింగ్ ఆఫ్ ఫైర్’.. ఈ సూర్యగ్రహణం భారత్‌లో దర్శనమిస్తుందా?
Solar Eclipse | ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్యగ్రహణం ఖగోళశాస్త్ర ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 2026 ఫిబ్రవరి 17న సంభవించనున్న ఈ సూర్యగ్రహణం కంకణాకార గ్రహణంగా ఆవిష్కృతం కాబోతోంది. గ్రహణ సమయంలో సూర్యుడి చుట్టూ అగ్ని వలయంలా ప్రకాశవంతమైన కాంతి కనిపించనుంది. ఈ అరుదైన దృశ్యాన్నే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణంగా పిలుస్తారు.
Solar Eclipse | ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్యగ్రహణం ఖగోళశాస్త్ర ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 2026 ఫిబ్రవరి 17న సంభవించనున్న ఈ సూర్యగ్రహణం కంకణాకార గ్రహణంగా ఆవిష్కృతం కాబోతోంది. గ్రహణ సమయంలో సూర్యుడి చుట్టూ అగ్ని వలయంలా ప్రకాశవంతమైన కాంతి కనిపించనుంది. ఈ అరుదైన దృశ్యాన్నే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణంగా పిలుస్తారు.
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. సాధారణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా, లేకపోతే పాక్షికంగా కప్పివేస్తాడు. అయితే, కంకణాకార సూర్యగ్రహణంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. చంద్రుడు భూమికి కొంచెం దూరంగా ఉన్న సమయంలో సూర్యుడి ముందు నుంచి ప్రయాణించడం వల్ల, సూర్యుడి కంటే చిన్నదిగా కనిపిస్తాడు. ఈ కారణంగా సూర్యుడు పూర్తిగా కప్పబడకుండా, దాని చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి వలయం ఏర్పడుతుంది. ఇదే ఈ గ్రహణాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.
అంతరిక్ష పరిశోధనా సంస్థల సమాచారం ప్రకారం.. ఈ సూర్యగ్రహణం పాక్షిక దశతో ప్రారంభమై క్రమంగా గరిష్ట స్థాయికి చేరుకొని ముగుస్తుంది. ఈ కంకణాకార సూర్యగ్రహణం 17న ఉదయం 9.56 (UTC) గంటలకు మొదలవుతుంది. సుమారు 12.12 గంటలకు గరిష్టానికి చేరుకుంటుంది. 2.27 గంటలకు ముగుస్తుంది. అయితే, ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దర్శనమివ్వనుంది. ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే, దక్షిణాఫ్రికా, జాంబియా, మొజాంబిక్, టాంజానియా వంటి దేశాలతో పాటు మారిషస్‌లో ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చని తెలిపారు. అంటార్కిటికా ప్రాంతాలు, దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాల్లో కూడా ఈ అద్భుత ఖగోళ దృశ్యం కనిపించనుంది. దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ప్రారంభమయ్యే ఈ గ్రహణ మార్గం.. అంటార్కిటికా తీర ప్రాంతాలను దాటి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ముగుస్తుంది.
ఇక ఈ ఏడాది ఆగస్టులో ఆగస్టు నెలలో రెండో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కావడం విశేషం. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్య నేరుగా వచ్చి సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తాడు. దీంతో భూమిపై కొంత ప్రాంతం కొద్దిసేపు పూర్తిగా చీకట్లో మునిగిపోతుంది. ఈ రెండో సూర్యగ్రహణం కూడా భారత్‌లో దర్శనమివ్వదు. భారత కాలమానం ప్రకారం.. రాత్రి సమయంలో ఈ గ్రహణం సంభవించనుంది. అయితే ఆఫ్రికా ఖండం, యూరప్, ఆర్కిటిక్ ప్రాంతాలు, స్పెయిన్, ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, ఐస్లాండ్ వంటి దేశాలు మరియు ప్రాంతాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం ఉంది. అలాగే, ఈ ఏడాది మరో రెండు చంద్రగ్రహణాలు కనిపించనున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు






