త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nuclear War Survival | అణు యుద్ధం వస్తే భూమిపై సురక్షితమైన ప్రాంతాలు ఏవి? మనుగడకు ఎక్కడ అవకాశం ఉంది?

ప్రపంచంలో అణు యుద్ధం సంభవిస్తే ఏ దేశాలు అత్యంత సురక్షితం? అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాల మధ్య యుద్ధం వస్తే మొదట నాశనమయ్యే దేశాలు ఏవి? 'అణు శీతాకాలం' (Nuclear Winter) ముప్పు నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కడ ఉన్నాయో, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి.

J

Science | Published On Mar 11, 2026, 5.28 pm IST

Nuclear War Survival | అణు యుద్ధం వస్తే భూమిపై సురక్షితమైన ప్రాంతాలు ఏవి? మనుగడకు ఎక్కడ అవకాశం ఉంది?
Advertisement

Nuclear War Survival | ప్రపంచ వ్యాప్తంగా అణు యుద్ధం (Global Nuclear War) వస్తుందనే ఊహ మానవాళికి అత్యంత భయానకమైనది. ఒకవేళ దేశాల మధ్య అణు దాడులు జరిగితే, ప్రాథమికంగా ప్రధాన రాజకీయ కేంద్రాలు, సైనిక స్థావరాలు, పారిశ్రామిక కేంద్రాలే లక్ష్యంగా ఉంటాయని మిలిటరీ విశ్లేషకులు, శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Nuclear War Survival | 'ఫస్ట్ స్ట్రైక్ జోన్' లో ఉన్న దేశాలు ఏవి?

అణు యుద్ధం వస్తే మొదట అత్యంత దారుణంగా నష్టపోయేది ప్రధాన అణ్వాయుధ దేశాలు, వాటి మిత్ర పక్షాలే. ఈ జాబితాలో అమెరికా, రష్యా, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్), ఫ్రాన్స్, భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా ఉన్నాయి. రాజకీయ, సైనిక, ఆర్థిక ప్రాముఖ్యత దృష్ట్యా వాషింగ్టన్, న్యూయార్క్, మాస్కో, బీజింగ్, లండన్, పారిస్ వంటి కీలక నగరాలు, సైనిక స్థావరాలు వ్యూహాత్మక లక్ష్యాలుగా మారే అవకాశం ఉంది.

దక్షిణ అర్ధగోళంలో ముప్పు తక్కువా?

కొన్ని అధ్యయనాల ప్రకారం, ఉత్తర అర్ధగోళంతో పోలిస్తే దక్షిణ అర్ధగోళంలోని (Southern Hemisphere) దేశాలు సాపేక్షంగా సురక్షితమైన స్థితిలో ఉండవచ్చు. దీనికి ప్రధాన కారణాలు ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలకు ఈ ప్రాంతాలు చాలా దూరంగా ఉండటం, వ్యూహాత్మక లక్ష్యాలు (Strategic targets) ఇక్కడ చాలా తక్కువగా ఉండటం, కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెంది ఉండటం.

Nuclear War Where Does Humanity Have the Best Chances of Survival?

ఎక్కువగా వినిపించే దేశాల పేర్లు

భౌగోళికంగా చూస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రపంచ దేశాలతో సంబంధం లేకుండా ఎక్కడో విసిరేసినట్లుగా ఉంటాయి. సొంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం కూడా ఉండటం వల్ల ఇవి కాస్త సురక్షితమైనవిగా పరిగణించబడుతున్నాయి. ముఖ్యంగా భారీ అణు పేలుళ్ల తర్వాత భూమిపై ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి ఏర్పడే 'అణు శీతాకాలం' (Nuclear Winter) వంటి విపత్కర పరిస్థితులను తట్టుకునే సత్తా వీటికి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భూమిపై పూర్తి సురక్షితమైన ప్రాంతం అంటూ ఉందా?

నిజం చెప్పాలంటే.. పూర్తిగా "సురక్షితమైన" ప్రదేశాలు భూమిపై చాలా అరుదు. కొన్ని ప్రాంతాలు ప్రత్యక్ష దాడుల నుంచి తప్పించుకున్నప్పటికీ, వాటి పరిణామాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. అణు యుద్ధం తర్వాత జరిగే వినాశనం ఎలా ఉంటుందంటే.. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడం వల్ల భూమి తీవ్రమైన చలికి గురవుతుంది. పంటలు నాశనం కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన కరవు, ఆహార కొరత ఏర్పడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది. ప్రజలు ప్రాణభయంతో వలసలు వెళ్లడం, వనరుల కోసం కొట్లాటలు, రాజకీయ అస్థిరత, గందరగోళం నెలకొంటాయి.

చాలా మంది శాస్త్రవేత్తలు ఏకీభవిస్తున్న వాస్తవం ఒక్కటే. భూమిపై ఎక్కడా పూర్తిగా 'సేఫ్ జోన్' (Safe zone) అంటూ ఏదీ లేదు. గ్లోబల్ న్యూక్లియర్ వార్ అనేది మొత్తం మానవ నాగరికతకే ఒక పెను విపత్తు. ప్రత్యక్ష దాడుల నుంచి తప్పించుకున్న ప్రాంతాలు కూడా వాతావరణ, ఆర్థిక, మానవతా సంక్షోభాలను దశాబ్దాల తరబడి ఎదుర్కోక తప్పదు.

Advertisement
Advertisement