త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Botsa Satyanarayana | బొత్స‌కు అస్వ‌స్థ‌త – అసెంబ్లీలోనే వైద్య ప‌రీక్ష‌లు

ఏపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ అస్వ‌స్థ‌త‌కు లోన‌య్యారు. కాగ్ రిపోర్ట్‌పై శాస‌న మండ‌లిలో ప్ర‌సంగిస్తోన్న స‌మ‌యంలో బీపీ హెచ్చుత‌గ్గుల కార‌ణంగా ఆయ‌న కింద‌ప‌డ‌బోయారు. అసెంబ్లీలోనే వైద్యులు ఆయ‌న‌కు చికిత్స‌ను అంద‌జేశారు.

N

News | Published On Mar 6, 2026, 5.03 pm IST

Botsa Satyanarayana |  బొత్స‌కు అస్వ‌స్థ‌త – అసెంబ్లీలోనే వైద్య ప‌రీక్ష‌లు
Advertisement

Botsa Satyanarayana | ఏపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అసెంబ్లీలోనే వైద్యులు ఆయ‌నకు చికిత్స‌ను అందించారు. శుక్ర‌వారం శాసనమండలిలో కాగ్ (CAG) రిపోర్ట్‌పై బొత్స మాట్లాడారు. త‌న ప్ర‌సంగం కొన‌సాగిస్తోన్న‌ సమయంలో బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా అస్వస్థతకు లోన‌య్యారు. బీపీ హెచ్చుతగ్గులు కావ‌డంతో కళ్ళు తిరిగి పడిపోబోయారు. ప‌క్క‌నే ఉన్న మ‌రో ఎమ్మెల్సీ ఆయ‌న్ని ప‌ట్టుకోవ‌డం పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. శాస‌న మండ‌లిలోని మిగిలిన స‌భ్యులు, సిబ్బంది త‌క్ష‌ణం స్పందించి అసెంబ్లీలోని మెడికల్ సెంటర్‌కు బొత్స‌ను త‌ర‌లించారు. బొత్స‌ బీపీ 190/120గా న‌మోదు అయిన‌ట్లు చెబుతోన్నారు. బీపీ హెచ్చుత‌గ్గుల‌తో పాటు నీర‌సం కార‌ణంగానే ఇలా జ‌రిగింద‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై బొత్స స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నాన‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని అన్నారు. విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెప్ప‌డంతో బొత్స ఇంటికి వెళ్లిపోయిన‌ట్లు చెబుతున్నారు. త‌దుప‌రి చికిత్స కోసం ఆయ‌నను హైద‌రాబాద్ త‌రలించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Advertisement
Advertisement