త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VC Sajjanar | యువ‌త బెట్టింగ్ ఊబిలో పడొద్దు: వీసీ స‌జ్జ‌నార్‌

Betting | ఐపీఎల్ (IPL) సీజన్ మొదలవుతున్న వేళ బెట్టింగ్ (Betting) ఊబిలో ప‌డొద్ద‌ని హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ (VC Sajjanar) సూచించారు. క్రికెట్‌(Cricket) ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

S

News | Published On Mar 28, 2026, 1.45 pm IST

VC Sajjanar | యువ‌త బెట్టింగ్ ఊబిలో పడొద్దు: వీసీ స‌జ్జ‌నార్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఐపీఎల్ (IPL) సీజన్ మొదలవుతున్న వేళ బెట్టింగ్ (Betting) ఊబిలో ప‌డొద్ద‌ని హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ (VC Sajjanar) సూచించారు. క్రికెట్‌(Cricket) ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో వందలాది బెట్టింగ్‌ యాప్‌ (Betting app)లను ప్రభుత్వం నిషేధించింద‌న్నారు. ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదిక‌ల్లో ఈ దందా కొత్త రూపం దాల్చింద‌ని చెప్పారు.

ప్ర‌త్యేక నిఘా పెట్టాం..

కేవలం డబ్బు కోసం ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు త‌ప్ప‌వ‌న్నారు. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకు ప్ర‌త్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బెట్టింగ్ తో అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్ద‌ని కోరారు. బెట్టింగ్ వ్య‌స‌నాన్ని అరికట్టే బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు. ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాల‌ని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement