Bharathi Hollikeri | బడి, గుడి, గుడిసె, ఆస్పత్రి.. ఇలా ఏదైనా లెక్కిస్తాం: జనగణన డైరెక్టర్ భారతీ హాళికేరి
Bharathi Hollikeri | తెలంగాణ భౌగోళిక పరిధిలోని బడి, గుడి, గుడిసె, ఆస్పత్రి, అద్దె భవనం ఇలా ఏదైనా లెక్కిస్తామని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికేరి అన్నారు. రేపటి నుంచి మే 10 వరకు తెలంగాణలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేపడతామని చెప్పారు.
Bharathi Hollikeri | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ భౌగోళిక పరిధిలోని బడి, గుడి, గుడిసె, ఆస్పత్రి, అద్దె భవనం ఇలా ఏదైనా లెక్కిస్తామని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికేరి అన్నారు. జనాభా లెక్కల సేకరణ (Census) వివరాలను శనివారం ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతి కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. 2027, ఫిబ్రవరిలో రెండో దశ మొదలయ్యేలోగా అంతా సిద్ధం చేస్తామన్నారు.
మే 11 నుంచి ఇండ్లకు మార్కు...
రెండో దశలో ఫిబ్రవరి నుంచి వ్యక్తిగత సమాచారం సేకరిస్తామని పేర్కొన్నారు. ఇళ్ల గణన కోసం బ్లాకులుగా విభజించి ఎన్యుమరేటర్లను కేటాయిస్తామని వివరించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి మార్కు చేస్తారని, ప్రతి భవనంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయనేది మార్కు చేస్తారని ఆమె తెలిపారు.
రేపటి నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ..
సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో 33 ప్రశ్నలు ఉంటాయి. సెల్ఫ్ ఎన్యుమరేషన్ తర్వాత రెండో దశలో ఎన్యుమరేటర్ ప్రతి ఇంటికీ వస్తారు. 33 ప్రశ్నల్లో 27 ప్రశ్నలకే ప్రజలు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 6 ప్రశ్నలకు ఎన్యుమరేటర్ ఇంటికి వస్తే వివరాలు చెప్పాలి. రేపటి నుంచి మే 10 వరకు తెలంగాణలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేపడతారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ తప్పనిసరి కాదు. ఆప్షన్ మాత్రమే. దేశంలో ఎక్కడ ఉన్నా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చు అని ఆమె సూచించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



