త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Terror plot | పంజాబ్‌లో ఉగ్ర కుట్ర.. నిందితుడి అరెస్టు

Terror plot in Punjab | భార‌త్‌లో త‌ర‌చూ ఏదో ఓ చోట గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఉగ్ర కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా పంజాబ్‌ (Punjab) పోలీసులు ఓ ఉగ్ర కుట్రను (Terror) నిర్వీర్యం చేశారు. పాకిస్థాన్ కు చెందిన‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో లింకులున్న ఓ నిందితుడిని అరెస్టు చేశారు.

S

News | Published On Apr 16, 2026, 1.12 pm IST

Terror plot | పంజాబ్‌లో ఉగ్ర కుట్ర.. నిందితుడి అరెస్టు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: భార‌త్‌లో త‌ర‌చూ ఏదో ఓ చోట గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఉగ్ర కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా పంజాబ్‌ (Punjab) పోలీసులు ఓ ఉగ్ర కుట్రను (Terror) నిర్వీర్యం చేశారు. పాకిస్థాన్ కు చెందిన‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో లింకులున్న ఓ నిందితుడిని అరెస్టు చేశారు.

వివ‌రాలిలా ఉన్నాయి. పంజాబ్‌లో ఉగ్ర కుట్ర‌లు జ‌రుగుతున్నట్లు స‌మాచారం అందింది. ఈ మేర‌కు అమృత్‌ సర్‌, మొహాలీలో స్టేట్‌ స్పెషల్‌ సెల్‌తో కలిసి కౌంటర్‌ వింగ్‌ ఆఫ్‌ పంజాబ్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ను నిర్వహించారు. అనుమానాస్ప‌దంగా ఉన్న ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత‌డి వద్ద నుంచి 4 గ్రనేడ్లతో పాటు రెండు విదేశీ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. పాక్‌తో సంబంధాలున్న నిందితుడు ఉగ్ర కుట్రకు ప్రణాళిక రచిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి ఇటీవల చంఢీగడ్‌లో జరిగిన దాడికి సంబంధం ఉన్నట్టు గుర్తించామన్నారు. అమృత్‌సర్‌లో కేసు నమోదు చేసిన‌ట్లు వివ‌రించారు. నిందితుడిని లోతుగా విచారించనున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. అతడి వ‌ద్ద‌ నుంచి 4 గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement