త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fireworks Factory Blast | బాణాసంచా ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. న‌లుగురి మృతి 

Fireworks Factory Blast | మధ్యప్రదేశ్‌ (Madhyapradesh) లో ఘోరం ప్ర‌మాదం చోటుచేసుకుంది. దేవాస్‌ జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు సంభవించగా ఈ ధాటికి షెడ్డు కుప్పకూలిపోయింది. అందులో పనిచేసే కార్మికులు చెల్లాచెదురుగా ఎగిరి పడ్డారు.

S

News | Published On May 14, 2026, 1.56 pm IST

Fireworks Factory Blast | బాణాసంచా ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. న‌లుగురి మృతి 
Advertisement
  • ప‌లువురి ప‌రిస్థితి విష‌మం.. మృతుల సంఖ్య పెరిగే చాన్స్‌
  • మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లాలో ఘ‌ట‌న

Fireworks Factory Blast | త్రినేత్ర‌.న్యూస్‌: మధ్యప్రదేశ్‌ (Madhyapradesh) లో ఘోరం ప్ర‌మాదం చోటుచేసుకుంది. దేవాస్‌ జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు సంభవించగా ఈ ధాటికి షెడ్డు కుప్పకూలిపోయింది. అందులో పనిచేసే కార్మికులు చెల్లాచెదురుగా ఎగిరి పడ్డారు. ఈ ఘటనలో న‌లుగురు మృతి చెంద‌గా ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స్థానిక మీడియా క‌థ‌నాల ద్వారా తెలుస్తోంది.

స్థానిక మీడియా చాన‌ళ్ల ప్రాథమిక సమాచారం మేర‌కు ఇప్పటిదాకా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న‌వారిని అంబులెన్స్‌ల‌లో ఇండోర్‌కు తరలిస్తున్నారు. ప్ర‌మాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండ‌గా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement