త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Noida Great India Place Mall | నోయిడా GIP మాల్: ఒకప్పుడు రూ.2,000 కోట్ల షాపింగ్ సామ్రాజ్యం.. నేడు దెయ్యాల కొంప

ఒకప్పుడు షాపింగ్ ప్రియులతో కిటకిటలాడే నోయిడా 'గ్రేట్ ఇండియా ప్లేస్' (GIP) మాల్ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. రూ. 2,000 కోట్ల విలువైన ఈ మాల్ 'ఘోస్ట్ టౌన్'గా మారడానికి కారణాలేంటి? వైరల్ అవుతున్న వీడియోల వెనుక అసలు కథ ఇదే.

J

News | Published On Feb 10, 2026, 4.04 pm IST

Noida Great India Place Mall | నోయిడా GIP మాల్: ఒకప్పుడు రూ.2,000 కోట్ల షాపింగ్ సామ్రాజ్యం.. నేడు దెయ్యాల కొంప
Advertisement

Noida Great India Place Mall | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) వాసులకు షాపింగ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు నోయిడాలోని 'గ్రేట్ ఇండియా ప్లేస్' (GIP Mall). ఒకప్పుడు పండగలు, వారాంతాల్లో ఇక్కడ కాలు పెట్టడానికి కూడా జాగా ఉండేది కాదు. కానీ, కాలం మారింది. రూ.2,000 కోట్ల విలువైన ఈ భారీ షాపింగ్ మాల్ ఇప్పుడు సందర్శకులు లేక వెలవెలబోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియోలు ఈ మాల్ యొక్క ప్రస్తుత దీనస్థితిని చూపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న 'ఘోస్ట్ టౌన్' వీడియోలు

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురు వినియోగదారులు GIP మాల్ వీడియోలను పోస్ట్ చేశారు. ఒకప్పుడు సందడిగా ఉండే కారిడార్లు ఇప్పుడు చీకటిగా, నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. మెజారిటీ షాపుల షట్టర్లు మూసివేసి ఉన్నాయి. ఫుడ్ కోర్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నెటిజన్లు ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోతూ, దీన్ని ఒక "ఘోస్ట్ టౌన్" (దెయ్యాల పట్టణం)తో పోలుస్తున్నారు.

How Noida Rs 2000 Crore Great India Place Mall Turned into a Ghost Town

ఒకప్పుడు ఆసియాలోనే ఐకానిక్ మాల్

సెక్టార్ 38-A లో ఉన్న ఈ మాల్‌ను 'యూనిటెక్ గ్రూప్' అభివృద్ధి చేసింది. ఇది ప్రారంభమైనప్పుడు దేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. వాటర్ పార్క్ (Worlds of Wonder), మల్టీప్లెక్స్, అంతర్జాతీయ బ్రాండ్లతో ఇది యువతకు హాట్ ఫేవరెట్ స్పాట్‌గా ఉండేది. దీని విలువ సుమారు రూ. 2,000 కోట్లుగా అంచనా.

పతనానికి కారణాలేంటి?

ఈ భారీ పతనానికి నెటిజన్లు. విశ్లేషకులు కొన్ని ప్రధాన కారణాలను ఎత్తిచూపుతున్నారు.

DLF మాల్ ఆఫ్ ఇండియా ఎంట్రీ

GIP మాల్‌కు కూతవేటు దూరంలోనే అత్యాధునిక హంగులతో 'DLF మాల్ ఆఫ్ ఇండియా' ప్రారంభమైంది. కొత్త బ్రాండ్లు, మెరుగైన ఇంటీరియర్స్, విశాలమైన పార్కింగ్ సదుపాయం ఉండటంతో జనం అటువైపు మళ్లారు.

How Noida Rs 2000 Crore Great India Place Mall Turned into a Ghost Town

నిర్వహణ లోపాలు

కాలక్రమేణా GIP మాల్ నిర్వహణలో నాణ్యత లోపించిందని, పాతబడిపోయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వల్ల వినియోగదారులు ఆసక్తి కోల్పోయారని అంటున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్ ప్రభావం

కరోనా తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ పెరగడం, థియేటర్లకు జనం రాక తగ్గడం కూడా ఇటువంటి భారీ మాల్స్ పై ప్రభావం చూపింది.

ఒకప్పుడు నోయిడాకు తలమానికంగా నిలిచిన 'గ్రేట్ ఇండియా ప్లేస్', ఇప్పుడు ఇలా నిర్మానుష్యంగా మారడం చూసి పాత తరం షాపింగ్ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Live Noida (@livenoida)

Advertisement
Advertisement