BJP Chief Ramchandar Rao | కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు బుద్ధి చెప్పేందుకు తరలిరండి: మహిళలకు బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు పిలుపు
BJP Chief Ramchandar Rao | మహిళా బిల్లుకు అడ్డుపడిన కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రధాని మోదీ (PM Modi) సభకు మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతో మోదీ తెలంగాణకు వస్తున్నారని చెప్పారు.
- ప్రధాని మోదీ సభకు యువత స్వచ్ఛందంగా వస్తామని చెబుతున్నరు
- రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ తీసుకొస్తున్నారు
- రెండు లక్షలకు పైగా జనసమీకరణ చేస్తున్నం
- బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు వెల్లడి
BJP Chief Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: మహిళా బిల్లుకు అడ్డుపడిన కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రధాని మోదీ (PM Modi) సభకు మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతో మోదీ తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌ను, కమ్యూనిస్టులను ఓడించాం..
నేను అధ్యక్షుడినయ్యాక మొదటిసారి ఈనెల 10న మోదీ తెలంగాణకు వస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలు అందరూ కలిసి స్వాగతం పలుకుదాం. సాయంత్రం 5 గంటలకు మోదీ ప్రసంగిస్తారు. జన్‌సంఘ్ ఫౌండర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్వస్థలం బెంగాల్ లో బీజేపీ మొదటిసారి గెలిచింది. ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక్క సీటు గెలవని పరిస్థితి ఉండే. గత ఎన్నికల్లో 78 సీట్లు గెలిచి ప్రధానప్రతిపక్షంగా ఉంటూ కమ్యూనిస్టులను, కాంగ్రెస్‌ను రాజకీయంగా ప్రాముఖ్యత లేకుండా చేసి అధికారంలోకి వచ్చాం అని బీజేపీ చీఫ్ పేర్కొన్నారు.
మోదీకి స్వాగతం పలకాలని ప్రజలు ఆతృతగా ఉన్నారు..
అసోంలో మూడోసారి పెద్ద మెజారిటీతో గెలిచాం. పుదుచ్చేరిలో కూడా విజయం సాధించాం. ఈ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. మోదీకి స్వాగతం పలకాలని ఎదురుచూస్తున్నారు. రెండు లక్షలకు పైగా జన సమీకరణ చేస్తున్నం. ఎప్పుడూ జరగనంత భారీ స్థాయిలో ఈ సభ జరుగుతుంది. ఇందుకు కార్యకర్తలు, నాయకులు అహోరాత్రులు కష్టపడుతున్నారు. వారందరికీ అభినందనలు తెలుపుతున్నాను అని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 13 లక్షల కోట్ల నిధులు, ప్రాజెక్టులు ఇచ్చింది. మహిళలకు 33 శాతం కోసం ప్రధాని మోదీ మహిళా బిల్లు తెచ్చారు. దీనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డుపడ్డాయి. బెంగాల్‌లో, అసోంలో, తమిళనాడులో మహిళలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు మహిళలు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది అని బీజేపీ చీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మోదీ సభకు యువకులు, మహిళలు, న్యాయవాదులు స్వచ్ఛందంగా వస్తామని చెబుతున్నారు. చాలా సంతోషకరం. పార్టీ కార్యాలయానికి వచ్చి వారి అభిప్రాయాలు చెబుతున్నారు. ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండ, వర్షం నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయాలి అని రాంచందర్‌రావు కోరారు.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



