త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Auto Accident | కృష్ణా జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ఆటో బోల్తా.. ఆరుగురి ప‌రిస్థితి విష‌మం

Krishna district | కృష్ణా జిల్లా(Krishna district) లోని నాగాయలంక సాయిబాబా గుడి వద్ద ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న బైకును తప్పించేందుకు ప్ర‌యత్నించ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు ఆటో బోల్తా (Auto overturned) పడింది.

S

News | Published On Apr 16, 2026, 11.57 am IST

Auto Accident | కృష్ణా జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ఆటో బోల్తా.. ఆరుగురి ప‌రిస్థితి విష‌మం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: క‌ర్నూలు జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 8 మంది మృతి చెంద‌గా మ‌రికొద్దిసేప‌టికే కృష్ణా జిల్లా(Krishna district) లోని నాగాయలంక సాయిబాబా గుడి వద్ద ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న బైకును తప్పించేందుకు ప్ర‌యత్నించ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు ఆటో బోల్తా (Auto overturned) పడింది. ఈ ఘోర‌ ప్రమాదంలో గణపేశ్వరం గ్రామానికి చెందిన 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

మొక్కజొన్న పనుల నిమిత్తం గ‌ణ‌పేశ్వ‌రం గ్రామ ప్ర‌జ‌లు బాపట్ల జిల్లా గొరికపూడికి వెళ్లారు. అనంత‌రం తిరిగి వస్తుండగా ఈ ప్ర‌మాదం సంభవించింది. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన‌ ఆరుగురి పరిస్థితి విషమంగా(6 people critical) ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. మరో ఐదుగురిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

 

Advertisement
Advertisement