త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Own Son Killed| నీ కొడుకు నీలా లేడంటూ స్నేహితుల‌ ఎగతాళి.. వెక్కిరింత‌లు తాళ‌లేక కుమారుడినే చంపుకున్న‌ తండ్రి

own son killed | త‌ర‌చూ స్నేహితుల ఎగ‌తాళి, సూటిపోటి మాట‌ల‌ను భ‌రించ‌లేక క‌న్న‌ కొడుకు(own son)నే అత్యంత దారుణంగా హ‌త్య (Murdered) చేశాడో తండ్రి. మాన‌వీయ‌త‌కే మ‌చ్చ తెచ్చే ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని విజయపుర జిల్లా నాగథాన గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

S

News | Published On Apr 16, 2026, 12.36 pm IST

Own Son Killed| నీ కొడుకు నీలా లేడంటూ స్నేహితుల‌ ఎగతాళి.. వెక్కిరింత‌లు తాళ‌లేక కుమారుడినే చంపుకున్న‌ తండ్రి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: త‌ర‌చూ స్నేహితుల ఎగ‌తాళి, సూటిపోటి మాట‌ల‌ను భ‌రించ‌లేక క‌న్న‌ కొడుకు(own son)నే అత్యంత దారుణంగా హ‌త్య (Murdered) చేశాడో తండ్రి. మాన‌వీయ‌త‌కే మ‌చ్చ తెచ్చే ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని విజయపుర జిల్లా నాగథాన గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలిలా ఉన్నాయి.

స్నేహితుల వెక్కిరింపు మాటలతో ఓ తండ్రి తన కొడుకునే దారుణంగా హత్య చేసి చంపిన ఘటన మానవీయతకే మచ్చ తెచ్చేలా ఉంది. 'నీ కొడుకు అసలు నీలా లేడు. ముఖం కూడా నీ ముఖానికి పోలిక లేదు' అని రోజూ ఎగతాళి చేస్తున్న స్నేహితుల మాటలను తట్టుకోలేక, తీవ్ర మనస్తాపానికి గురై ఆరేళ్ల తన కన్న కొడుకును కృష్ణా నదిలోకి తోసేసి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా నాగథాన గ్రామంలో మార్చి 16న జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అరే మ‌ల్లికార్జునా.. నీకు నీ కుమారుడి ముఖం స‌రిపోల‌డం లేదు. అస‌లు వాడి మొఖం నీలా లేదు.. అంటూ స్నేహితులు త‌ర‌చూ ఎగ‌తాళి చేసేవారు. ఆ మాట‌లు విని వినీ చివ‌రికి త‌న ఆరేండ్ల క‌న్న కొడుకుపైనే కోపం పెంచుకున్నాడు. స్నేహితుల సూటిపోటి మాట‌లు కొడుకు ప్రాణాలు తీసేలా పురిగొల్పాయి. సిందగిలోని ఓ కోచింగ్ సెంటర్‌లో చేర్పిస్తానని ఇంట్లో చెప్పిన మల్లికార్జున్‌.. అక్క‌డికి తీసుకెళ్లకుండా మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కరాడ్ సమీపంలో ఉన్న కృష్ణా నది వ‌ద్ద‌కు తీసుకెళ్లి నేరుగా నదిలోకి తోసేశాడు. ఇక ఏమీ తెలియ‌న‌ట్టు ఇంటికి వ‌చ్చాడు. ఇక మ‌న కొడుకును మ‌ర్చిపో అంటూ త‌న భార్య భాగ్యశ్రీ తెల‌ప‌డంతో ఆమె బోరున విల‌పించింది.

భాగ్య‌శ్రీ ఫిర్యాదుతో..

కొడుకుతో మాట్లాడాల‌ని భాగ్య‌శ్రీ మ‌ల్లికార్జున్‌ను అడ‌గ‌గా ఆయన వేరే ఎవరో వ్యక్తికి ఫోన్ చేసిన‌ట్లు తెలిపింది. 'మీ కొడుకు మీతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదంటూ ఆ వ్యక్తి చెప్పిన‌ట్లు పేర్కొంది. ఈనెల‌ 1న కొడుకు పుట్టిన రోజు కావడంతో తల్లి భాగ్యశ్రీ మార్చి 31న కొడుకును కలుద్దామని భర్తని అడిగింది. సరేనని చెప్పిన భ‌ర్త ఆమెను సిదంగి వైపు తీసుకెళ్లాడు. ఎక్క‌డెక్క‌డో తిప్పుతూ చివరికి ఇంటికి తీసుకెళ్లాడు. భార్యకు అనుమానం వచ్చి గ్రామ పెద్దల స‌మ‌క్షంలో పంచాయితీ పెట్టించింది. ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఇద్ద‌రూ క‌లిసి ఇంటికి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో భర్త మన కొడుకును మర్చిపో అని చెబుతూ మ‌ల్లికార్జున్ ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. ఇదే విష‌యాన్ని భాగ్య‌శ్రీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు మల్లికార్జునను అరెస్టు చేసి త‌మదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకొన్నాడు.

Advertisement
Advertisement