త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

దివాలా తీసిన KLSR ఇన్ ఫ్రాటెక్ కంపెనీకి 2500 భారీ కాంట్రాక్టులు

రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ KLSR ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ పైన నమోదైన కేసులు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసింది. సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయి అని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణం.ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీ కోసమే అధికారుల పైన ఒత్తిడి తీసుకువచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారు.

a

News | Published On Mar 13, 2026, 4.10 pm IST

దివాలా తీసిన KLSR ఇన్ ఫ్రాటెక్ కంపెనీకి 2500 భారీ కాంట్రాక్టులు

సంక్షిప్త సారాంశం

KLSR కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. కంపెనీ కోసం నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ KLSR కంపెనీ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తగిన విచారణ చేసి నిజాలు నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Advertisement

దివాలా తీసిన కంపెనీకి 2500 భారీ కాంట్రాక్టులు

కేసులు నమోదైతే సాక్ష్యాధారాలు మాయం చేసిన అధికారులు

KLSR ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ చేస్తున్న నేరాలు అన్నీ ఇన్నీ కావు

సీబీఐతో, ఈడీతో విచారణ చేయించండి

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ

త్రినేత్ర.న్యూస్  ముఖ్యమంత్రి బినామీ కంపెనీ KLSR ఇన్‌ఫ్రాటెక్ పూర్తిగా దివాలా తీసిన కంపెనీ అని..అయినా సరే దానికి సీఎం 2500కు పైగా భారీ ఆర్థిక విలువ చేసే కాంట్రాక్టులను కట్టబెట్టారంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆ కంపెనీ చేస్తున్న ఆర్థిక అరాచకాలపై సీబీఐ, ఈడీ వంటి సంస్థలపై విచారణ జరిపించాలని ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఇతర మంత్రులు నిర్మల సీతారామన్, పీయూష్ గోయల్‌, అర్జున్ రామ్ మేఘ్వాల్‌... కేటీఆర్ లేఖ పంపారు.

ఈ లేఖ సారాంశం ఇలా ఉంది.

రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ KLSR ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ పైన నమోదైన కేసులు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసింది. సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయి అని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణం.ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీ కోసమే అధికారుల పైన ఒత్తిడి తీసుకువచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను పోలీసు అధికారులను నమ్మే పరిస్థితి లేదు…తన బినామీ కంపెనీ కోసం సాక్షాధారాలను ముఖ్యమంత్రి మాయం చేయించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పోయింది. KLSR కంపెనీ దివాలా తీసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయిస్తున్నారు. ఆ సంస్థ పై ఉన్న విచారణను సీఎం అడ్డుకుంటున్నారు.

నిష్పక్షపాతంగా విచారణ జరపండి

KLSR కంపెనీ పైన ఉన్న ఆర్థిక పరమైన ఆరోపణలు, కేసుల పైన పక్షపాతం లేకుండా, ఒత్తిడి లేకుండా నిష్పాక్షిక విచారణ జరిగేలా చూడాలి.  ఇప్పటికే దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీ కోసం రేవంత్ రెడ్డి 2500కు పైగా భారీ కాంట్రాక్టులను కేటాయించారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులతో పాటు యంగ్ ఇండియా స్కూల్ ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణ పనులను అడ్డగోలుగా రేవంత్ రెడ్డి దివాలా తీసిన ఈ కంపెనీకి అప్పచెబుతున్నారు. KLSR కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసు. కంపెనీ కోసం నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ KLSR కంపెనీ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తగిన విచారణ చేసి నిజాలు నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది.అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఈ కంపెనీ చేస్తున్న నేరాలు, ఈ కంపెనీకి ముఖ్యమంత్రి చేస్తున్న అనుచిత లబ్ది నేపథ్యంలో సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) వంటి ఏజెన్సీలతో సంపూర్ణ దర్యాప్తు చేయించాలి

 

ట్యాగ్స్:

Advertisement
Advertisement