త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sarla Maheshwari | దూర‌ద‌ర్శ‌న్ ప్ర‌ముఖ న్యూస్ రీడ‌ర్ స‌ర‌ళ మ‌హేశ్వ‌రి క‌న్నుమూత‌

Sarla Maheshwari | ప్ర‌ముఖ దూర‌ద‌ర్శ‌న్ న్యూస్ యాంక‌ర్ (Doordarshan News Anchor) స‌ర‌ళ మ‌హేశ్వ‌రి (Sarla Maheshwari) క‌న్నుమూశారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె గురువారం తుది శ్వాస విడిచారు.

D

National | Published On Feb 12, 2026, 5.00 pm IST

Sarla Maheshwari | దూర‌ద‌ర్శ‌న్ ప్ర‌ముఖ న్యూస్ రీడ‌ర్ స‌ర‌ళ మ‌హేశ్వ‌రి క‌న్నుమూత‌
Advertisement

Sarla Maheshwari | ప్ర‌ముఖ దూర‌ద‌ర్శ‌న్ న్యూస్ యాంక‌ర్ (Doordarshan News Anchor) స‌ర‌ళ మ‌హేశ్వ‌రి (Sarla Maheshwari) క‌న్నుమూశారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె గురువారం తుది శ్వాస విడిచారు. ప్ర‌స్తుతం ఆమె వ‌యసు 71 ఏళ్లు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ దూర‌ద‌ర్శ‌న్ న్యూస్ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టింది. దూర‌ద‌ర్శ‌న్ మాజీ యాంక‌ర్ స‌ర‌ళ మ‌హేశ్వ‌రి 71 సంవ‌త్స‌రాల వ‌య‌సులో మ‌ర‌ణించిన‌ట్లు పేర్కొంది. 1980ల్లో డీడీ న్యూస్‌లో అత్యంత సుప‌రిచిత‌మైన, ప్ర‌సిద్ధ వ్య‌క్తుల్లో ఒక‌రు అని తెలిపింది. భార‌తీయ వార్తా ప్ర‌పంచంలో ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని పేర్కొంది. ఈ మేర‌కు ఆమె మృతికి నివాళి అర్పించింది. ఈ పోస్ట్ చూసిన ప‌లువురు స‌ర‌ళ మ‌హేశ్వ‌రి మృతికి సంతాపం వ్య‌క్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

స‌ర‌ళ మ‌హేశ్వ‌రి తొలిసారి 1976లో దూర‌ద‌ర్శ‌న్‌లో చేరారు. ఆ త‌ర్వాత ఆరేళ్ల‌కు అంటే 1982లో ఫుల్‌టైం న్యూస్ రీడర్ అయ్యారు. ఆ త‌ర్వాత 1984 త‌ర్వాత బీబీసీ న్యూస్ రీడ‌ర్‌గా వెళ్లారు. రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ డీడీకే వ‌చ్చారు. 2005 వ‌ర‌కూ ఆమె అందులోనే న్యూస్ రీడిర్‌గా త‌న కెరీర్‌ను కొన‌సాగించారు. ఆ స‌మ‌యంలో న్యూస్ రీడ‌ర్‌గా ఆమెకు మంచి గుర్తింపు వ‌చ్చింది. చీర‌క‌ట్టు, ఉచ్ఛ‌ర‌ణ‌తో అంద‌రిని ఆక‌ట్టుకున్నారు. 2005 త‌ర్వాత ఆమె రిజైన్ చేశారు.

Advertisement
Advertisement