UPSC CAPF (AC) Recruitment | సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు..
UPSC CAPF (AC) Recruitment | కేంద్ర భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ (UPSC CAPF (AC) Recruitment) పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 349 పోస్టులను భర్తీ చేయనుంది.
UPSC CAPF (AC) Recruitment | త్రినేత్ర.న్యూస్: కేంద్ర భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ (UPSC CAPF (AC) Recruitment) పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 349 పోస్టులను భర్తీ చేయనుంది. బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్లఎస్‌బీ)లో అసిస్టెంట్ కమాండెంట్ల (గ్రూప్ ఎ) ఉద్యోగాలను సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్ ద్వారా యూపీఎప్సీ భర్తీ చేయనుంది. డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. రాత పరీక్షను జూలై 19న నిర్వహిస్తారు.
మొత్తం ఖాళీలు: 349
బీఎస్‌ఎఫ్‌లో 108, సీఆర్‌పీఎఫ్ 106, సీఐఎస్‌ఎఫ్ 70, ఐటీబీపీ 12, ఎస్‌ఎస్‌బీలో 53 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. 2026 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్సు, నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం..
రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ ద్వారా. రాతపరీక్ష రెండు పేర్లు ఉంటాయి. ఇందులో జనరల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్, జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అండుగుతారు. పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో (పెన్ను, పేపర్) ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారిని ఫిజికల్ టెస్ట్‌కు పిలుస్తారు. అందులో షార్ట్ లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు. ఉద్యోగం సాధించిన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
అప్లికేషన్లకు చివరి తేదీ: మార్చి 12
రాతపరీక్ష: జూలై 19
వెబ్‌సైట్: upsc.gov.in
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



