త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pothole deaths in UP | యూపీలో గుంతల రోడ్ల మృత్యుఘోష.. హైవేలపై రోజూ నలుగురి బలి!

ఉత్తరప్రదేశ్‌లో జాతీయ రహదారులపై ఉన్న గుంతలు వాహనదారుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. 2024లో కేవలం గుంతల వల్లే యూపీలో ఏకంగా 1,369 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున రోజుకు నలుగురు మృత్యువాత పడుతున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ మరణాల సంఖ్య భారీగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

J

National | Published On Mar 4, 2026, 4.58 pm IST

Pothole deaths in UP | యూపీలో గుంతల రోడ్ల మృత్యుఘోష.. హైవేలపై రోజూ నలుగురి బలి!
Advertisement

Pothole deaths in UP | త్రినేత్ర.న్యూస్ : రహదారులపై సురక్షిత ప్రయాణం ఇప్పుడు గగనంగా మారుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ (UP) రాష్ట్రంలోని జాతీయ రహదారులపై (National Highways) ఏర్పడిన భారీ గుంతలు వాహనదారుల ప్రాణాలను హరిస్తున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం... యూపీలో రోడ్లపై ఉన్న గుంతల కారణంగా రోజూ సగటున నలుగురు ప్రాణాలు కోల్పోతున్నారు.

2024లో ఏకంగా 1369 మంది మృతి

2024 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన డేటా విస్తుపోయేలా ఉంది. జాతీయ రహదారులపై ఉన్న గుంతల వల్ల జరిగిన ప్రమాదాల్లో యూపీలో ఏకంగా 1369 మంది మరణించారు. ఇది దేశంలోనే అత్యధికం. గుంతల వల్ల జరిగే మరణాల్లో టాప్-5 లో ఉన్న మిగతా నాలుగు రాష్ట్రాల (మధ్యప్రదేశ్, తమిళనాడు, అస్సాం, ఒడిశా) మొత్తం మరణాల సంఖ్యను కలిపినా సరే... ఒక్క యూపీలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం అక్కడి రహదారుల దుస్థితికి, పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

2024లో హైవేలపై గుంతల కారణంగా అత్యధిక మరణాలు నమోదైన టాప్-5 రాష్ట్రాలు.

ఉత్తరప్రదేశ్: 1369

మధ్యప్రదేశ్: 277

తమిళనాడు: 109

అస్సాం: 87

ఒడిశా: 85

ఈ గణాంకాలు రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జాతీయ రహదారుల నిర్వహణను మెరుగుపరచాల్సిన అవసరాన్ని, అధికారులు తక్షణమే స్పందించి గుంతల మరమ్మతులు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఈ మరణాల సంఖ్య స్పష్టం చేస్తోంది.

Advertisement
Advertisement