Kalki Bhagwan | ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత
Kalki Bhagwan | త్రినేత్ర న్యూస్: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వన్నెస్ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ (Kalki Bhagwan) కన్నుమూశారు. వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో గత పదిరోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Kalki Bhagwan | త్రినేత్ర న్యూస్: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వన్నెస్ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ (Kalki Bhagwan) కన్నుమూశారు. వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో గత పదిరోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ట్రస్టు ప్రతినిధి వెల్లడించారు. బుధవారం ఉదయం 11 గంటలకు తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తులవల్లంలోని ఏకం ఆలయానికి (Golden City) ఆయన పార్థివదేహాన్ని తరలించనున్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. శనివారం కల్కి భగవాన్ అంత్యక్రియలను ఆలయంలోనే నిర్వహిస్తారు. సతీమణి అమ్మభగవాన్‌తో కలిసి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన కల్కి భగవాన్‌కు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆధ్యాత్మిక సాధన, మానవతా విలువలు, సేవాభావంపై భక్తులకు మార్గదర్శనం చేశారు. ఆయన మృతి వార్తతో భక్తులు, శిష్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయకుమార్ 1949లో తమిళనాడులో జన్మించారు. కొంతకాలం ఎల్‌ఐసీ (LIC) ఏజెంటుగా, ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1977 జూన్ 9న పద్మావతిని వివాహం చేసుకున్నారు. 1980వ దశకం మధ్యలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం రాజుపేట సమీపంలో జీవాశ్రమం పేరుతో రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రారంభించారు. అనంతరం దానిని ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కేంద్రం ‘సత్యలోకం’గా (Satyaloka) పేరు మార్చారు. 1992లో తాను కల్కి అవతారమంటూ కల్కి భగవాన్ పేరుతో ప్రపంచానికి పరిచయమయ్యారు. తొలుత కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు.

అనంతరం దానిని తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోఉన్న నేమం ప్రాంతంలో కల్కి భగవాన్‌గా ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ఆ తర్వాత వరదయ్యపాళెం పంచాయతీ గోవర్ధనపురంలో కల్కి గ్రామీణాభివృద్ధి ట్రస్టు పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని వన్నెస్ (Oneness) పేరుతో అంతర్జాతీయ స్థానికి విస్తరించారు. ఆశ్రమాల్లో విదేశీ భక్తులతో పాటు, దేశం నలుమూలల నుంచి వచ్చే వారికి ధ్యానం, ముక్తి దీక్ష తదితర ఆధ్యాత్మిక తరగతులు నిర్వహించేవారు. ధ్యానం, ఆత్మ పరిశీలన, అంతర్గత మార్పు, మానసిక ప్రశాంతత వంటి అంశాలకు విజయకుమార్ తన బోధనల్లో ప్రాధాన్యం ఇచ్చేవారు.
తాజావార్తలు
- ●Private Travels Bus | ట్రావెల్స్ బస్సు బోల్తా.. తప్పిన ప్రాణ నష్టం
- ●Graduate MLC | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
- ●Horoscope | సెప్టెంబర్ 30 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం!
- ●Inactive Ration Card Deactivate | 6 నెలలు సరుకులు తీసుకోకుంటే రేషన్ కార్డు కట్
- ●Erravelli | ఎర్రవెల్లి సర్వే నంబర్లో కలిపారు.. పొంగులేటిని కలిసిన వెంకటాపూర్ రైతులు
- ●Ntr | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు - జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ ఎంట్రీ

Private Travels Bus | ట్రావెల్స్ బస్సు బోల్తా.. తప్పిన ప్రాణ నష్టం

Graduate MLC | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Horoscope | సెప్టెంబర్ 30 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం!

Inactive Ration Card Deactivate | 6 నెలలు సరుకులు తీసుకోకుంటే రేషన్ కార్డు కట్



