Southern Railway | రైళ్లలో గట్టిగా పాటలు వింటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు
Southern Railway | రైళ్లలోగానీ (trains), స్టేషన్లలోగానీ (railway stations) గట్టిగా ఫోన్‌లో మాట్లాడటం, బయటకు పాటలు పెట్టడం చేస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. రూ.1,000 నుంచి రూ.5,000 వరకూ భారీ జరిమానా పడే అవకాశం ఉంది. ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించనున్నారు.
Southern Railway | త్రినేత్ర న్యూస్ : సాధారణంగా ప్రయాణ సమయంలో కాలక్షేపం కోసం ప్రయాణికులు ఫోన్ మాట్లాడటం, పాటలు వినడం సర్వసాధారణం (mobile phone speakers). కొంతమంది తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బ్లూటూత్ వాడుతూ ఫోన్‌లో పాటలు, వీడియోలు చూస్తుంటారు. అయితే, మరికొందరు బయటకి పాటలు పెడుతూ, ఫోన్‌లో గట్టిగా మాట్లాడుతూ న్యూసెన్స్ చేస్తుంటారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
ఈ మేరకు చెన్నైలోని దక్షిణ రైల్వే (Southern Railway) ప్రధాన కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైలు ప్రయాణంలో (trains) గట్టిగా పాటలు వినడం, వీడియోలు చూడటం లేదా బిగ్గరగా మాట్లాడటం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. భారీ జరిమానాతోపాటూ జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. రైల్వే ప్రయాణాన్ని మరింత ప్రశాంతంగా మార్చేందుకు భారతీయ రైల్వే (Indian Railways) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1,000 వరకూ జరిమానా విధిస్తారు. అంతేకాదు, ఎంత హెచ్చరించినా పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే ఆరు నెలల వరకు సాధారణ జైలు శిక్ష, రూ.5,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
రైళ్లలో, స్టేషన్లలో మొబైల్ స్పీకర్ల ద్వారా పెద్ద శబ్దంతో పాటలు, వీడియోలు వినిపించడం వల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని రైల్వే శాఖ పేర్కొంది. ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు, విశ్రాంతి తీసుకోవాలనుకునేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్టేషన్లలో, రైళ్లలో ప్రకటనలు చేయాలని రైల్వే డివిజన్లను ఆదేశించింది. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లోనూ ప్రకటనలు చేయాలని సూచించింది.
Also Read..
ఈ వారంలో దక్షిణాదిలో భారీ వర్షాలు : ఐఎండీ
మిడిల్ ఈస్ట్‌లో ముదురుతున్న సంక్షోభం: సౌదీ, యూఏఈ సహా 12 దేశాలకు అమెరికా సెక్యూరిటీ అలర్ట్
స్టాక్ మార్కెట్‌లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..
సంబంధిత వార్తలు

Railway | రాళ్లు రువ్వడం, దొంగతనాలకు చెక్.. రైల్వే ట్రాక్‌లపై నిఘా..!
అక్టోబర్ 16, 2026

Special Trains | పండుగల వేళ ప్రయాణిలకు శుభవార్త.. గుంటూరు, యశ్వంత్‌పూర్‌కు ప్రత్యేక రైళ్లు
అక్టోబర్ 8, 2026

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్‌లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..
- ●Ramachander Rao | నిజానికి రాహుల్ గాంధీనే అసలైన దొంగ
- ●Telugu OTT | ఓటీటీలోకి తెలుగు టీనేజ్ బోల్డ్ లవ్‌స్టోరీ - ఇంటర్‌లోనే ప్రేమలో పడితే!
- ●Special Inspection Drive | నకిలీ నంబర్ ప్లేట్లను వాడితే ఊచలే.. ప్రత్యేక డ్రైవ్‌లో ఎన్ని కేసులు అయ్యాయంటే!
- ●Ponguleti Srinivas Reddy | 34 నెలల్లో 12.40 లక్షల పట్టాదారు పాస్ బుక్‌లు జారీ
- ●IMD | ఈ వారంలో దక్షిణాదిలో భారీ వర్షాలు : ఐఎండీ

Stock Markets | స్టాక్ మార్కెట్‌లలో భారీ పతనం.. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ..

Ramachander Rao | నిజానికి రాహుల్ గాంధీనే అసలైన దొంగ

Telugu OTT | ఓటీటీలోకి తెలుగు టీనేజ్ బోల్డ్ లవ్‌స్టోరీ - ఇంటర్‌లోనే ప్రేమలో పడితే!

Special Inspection Drive | నకిలీ నంబర్ ప్లేట్లను వాడితే ఊచలే.. ప్రత్యేక డ్రైవ్‌లో ఎన్ని కేసులు అయ్యాయంటే!



