Bhagwant Mann | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. రూ.50,000 ఫైన్
Bhagwant Mann | ప్యారిస్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann)ను ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో అడ్డుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆరోపించింది. పై నుంచి ఒత్తిడి ఉందంటూ అసంబంద్ధంగా రూ.50,000 ఫైన్ వేశారని తెలిపింది.
Bhagwant Mann | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సంచలన ఆరోపణలు చేసింది. ప్యారిస్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann)ను ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో అడ్డుకున్నారని ఆరోపించింది. దాదాపు 3 గంటల పాటూ అక్కడ నిర్బంధించినట్లు పంజాబ్ ఆప్ మీడియా ఇన్‌ఛార్జ్ బల్తేజ్ పన్ను (Baltej Pannu) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వీడియో పెట్టారు.
"ప్యారిస్ నుంచి వచ్చిన భగవంత్ మాన్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. మీ సామాను ఇంకా రాలేదని, లగేజీని చెక్ చేస్తున్నామంటూ ఎయిర్‌పోర్టులోనే ఆపేశారు. దాదాపు మూడు గంటల తర్వాత ఆయన్ని బయటకు వెళ్లేందుకు అనుమతించారు. సీఎం మాన్ తన సామానును కారులో ఎక్కించుకుని బయల్దేరుతుండగా అధికారులు పరిగెత్తుకు వచ్చి ఆయన్ని ఆపారు. పై నుంచి ఒత్తిడి ఉందంటూ అసంబంద్ధంగా రూ.50,000 ఫైన్ వేశారు. ఆ జరిమానా ఎందుకు విధించారన్న దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు" అని బల్తేజ్ పన్ను ఆరోపించారు. ముఖ్యమంత్రి మాన్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని, పంజాబ్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అంతేకాదు భగవంత్ మాన్ ఫ్రాన్స్ పర్యటనకు కేంద్ర పదే పదే అడ్డుపడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం
మరోవైపు పంజాబ్ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ప్యారిస్ వెళ్లిన ముఖ్యమంత్రిని విమానాశ్రయంలో ఇబ్బంది పెట్టారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సైతం విమర్శించారు. కేంద్రం తనకు ఎన్ఓసీ ఇవ్వకపోవడాన్ని సవాలు చేసిన తర్వాతే సీఎంను కేంద్ర పెద్దలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఈ అహంకారపూరిత ధోరణిని వీడాలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Also Read..
జియో ఐపీఓ నేడే ప్రారంభం.. జీఎంపీ వివరాలివే.. బ్రోకరేజీలు ఏమంటున్నాయి..?
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్..
సంబంధిత వార్తలు

Arvind Kejriwal | దేశంలోనే అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌ను తమ అల్లుడిగా చేసుకున్నారు.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు
అక్టోబర్ 19, 2026

France Protests | భగ్గుమన్న ఫ్రాన్స్.. 143 ఏండ్ల చారిత్రక భవనానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
అక్టోబర్ 18, 2026

Arvind Kejriwal | డ్రగ్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అమిత్ షాకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Jio IPO | జియో ఐపీఓ నేడే ప్రారంభం.. జీఎంపీ వివరాలివే.. బ్రోకరేజీలు ఏమంటున్నాయి..?
- ●Krishna Godavari River Management Board | కృష్ణా, గోదావరి జలాలపై మళ్లీ రగడ: 70:30 వాటాపై తెలంగాణ పట్టు.. ఈ నెల 26, 30 భేటీల్లో తేలేదేంటి?
- ●Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్..
- ●Deer | కర్ణాటకలో జింకల వేట.. హైదరాబాద్‌లో మాంసం విక్రయం
- ●Harish Rao | త్వరలోనే సిద్దిపేటకు యూనివర్సిటీ తీసుకువస్తా
- ●Tirumala | తిరుమలలో సిఫారసు లేఖలు తాత్కాలికంగా రద్దు

Jio IPO | జియో ఐపీఓ నేడే ప్రారంభం.. జీఎంపీ వివరాలివే.. బ్రోకరేజీలు ఏమంటున్నాయి..?

Krishna Godavari River Management Board | కృష్ణా, గోదావరి జలాలపై మళ్లీ రగడ: 70:30 వాటాపై తెలంగాణ పట్టు.. ఈ నెల 26, 30 భేటీల్లో తేలేదేంటి?

Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్..

Deer | కర్ణాటకలో జింకల వేట.. హైదరాబాద్‌లో మాంసం విక్రయం



