Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్..
Stock Markets | దసరా సెలవు అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 485.03 పాయింట్లు (0.66 శాతం) లాభపడి 74,337.93 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ50 సూచీ 127.05 పాయింట్లు (0.56 శాతం) ఎగబాకి 23,016.00 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.
Stock Markets | దసరా సెలవు అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 485.03 పాయింట్లు (0.66 శాతం) లాభపడి 74,337.93 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ50 సూచీ 127.05 పాయింట్లు (0.56 శాతం) ఎగబాకి 23,016.00 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. రష్యా నుంచి అమెరికా భారీ ఎత్తున డీజిల్‌ను దిగుమతి చేసుకునేందుకు అంగీకరించడం, రష్యా నుంచి చమురు కొనే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు, 100 శాతం టారిఫ్‌లను ఎత్తివేయడం వంటి పలు కారణాల వల్ల మంగళవారం చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో విదేశీ నిఫ్టీ సూచీ గిఫ్ట్ నిఫ్టీ సైతం గత సెషన్‌లో భారీగా లాభపడింది. అదే లాభం ఇవాళ్టి దేశీయ సూచీల ట్రేడింగ్‌లోనూ కొనసాగింది.
ఐటీ షేర్లలో ర్యాలీ..
విస్తృత మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీలు లాభాల్లో ఉండగా, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 2.26 శాతం పెరిగి భారీ లాభాలను నమోదు చేసింది. అలాగే నిఫ్టీ ఐటీ టెలికమ్యూనికేషన్స్, నిఫ్టీ సిమెంట్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన సూచీలు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ కెమికల్స్ సూచీ 0.54 శాతం నష్టపోగా, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు సైతం అదే బాటలో కొనసాగాయి. అయితే మంగళవారం భారత మార్కెట్లకు సెలవు కారణంగా ట్రేడింగ్ జరగకపోయినా ముడి చమురు ధరలు పతనం అవడం బుధవారం సూచీలకు బూస్ట్ ఇచ్చింది. కానీ బుధవారం మాత్రం ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి.
పెరిగిన చమురు ధరలు..
అంతర్జాతీయ మార్కెట్‌లలో బ్రెంట్ క్రూడ్ ధర 1.06 శాతం పెరిగి బ్యారెల్‌కు 106 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.93 శాతం పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి విలువ రోజు రోజుకీ పెరుగుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 94.67 వద్ద ఉన్న భారత రూపాయి ఈ సెషన్‌లో 0.11 శాతం లాభపడింది. అయితే ముడి చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Deer | కర్ణాటకలో జింకల వేట.. హైదరాబాద్‌లో మాంసం విక్రయం
- ●Harish Rao | త్వరలోనే సిద్దిపేటకు యూనివర్సిటీ తీసుకువస్తా
- ●Tirumala | తిరుమలలో సిఫారసు లేఖలు తాత్కాలికంగా రద్దు
- ●Lawyer Suicide | ఖమ్మం జిల్లాలో విషాదం.. యువ న్యాయవాది ఆత్మహత్య
- ●Hyderabad Zoo | దసరా రోజు హైదరాబాద్ జూపార్కుకు పోటెత్తిన సందర్శకులు..
- ●అక్టోబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని లాభాలు..!

Deer | కర్ణాటకలో జింకల వేట.. హైదరాబాద్‌లో మాంసం విక్రయం

Harish Rao | త్వరలోనే సిద్దిపేటకు యూనివర్సిటీ తీసుకువస్తా

Tirumala | తిరుమలలో సిఫారసు లేఖలు తాత్కాలికంగా రద్దు

Lawyer Suicide | ఖమ్మం జిల్లాలో విషాదం.. యువ న్యాయవాది ఆత్మహత్య






