త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Power Grid Recruitment | ప‌వ‌ర్ గ్రిడ్‌లో 660 ట్రెయినీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చేశారా?

Power Grid Recruitment | పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్ (PGCIL)​ డిప్లొమా ట్రెయినీ, జూనియర్ ఆఫీసర్​ ట్రెయినీ, జూనియర్​ టెక్నీషియన్​ ట్రెయినీ పోస్టులను (Trainee Posts) భర్తీ చేయనుంది. మొత్తం 660 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Power Grid Recruitment) విడుద‌ల చేసింది.

G

National | Published On May 7, 2026, 8.50 am IST

Power Grid Recruitment | ప‌వ‌ర్ గ్రిడ్‌లో 660 ట్రెయినీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చేశారా?
Advertisement

Power Grid Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్ (PGCIL)​ డిప్లొమా ట్రెయినీ, జూనియర్ ఆఫీసర్​ ట్రెయినీ, జూనియర్​ టెక్నీషియన్​ ట్రెయినీ పోస్టులను (Trainee Posts) భర్తీ చేయనుంది. మొత్తం 660 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Power Grid Recruitment) విడుద‌ల చేసింది. మే 11 వ‌రకు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇంజినీరింగ్​తో పాటు డిప్లొమా, గ్రాడ్యుయేషన్​/ సీఎంఏ, సీఏ, ఐటీఐ చేసిన వారు అర్హ‌లు. రాత పరీక్షతో నియామకాలు ఉంటాయి. నెలకు రూ.24,000 నుంచి 1,08,000 వరకు వేతనం ఉంటుంది. ట్రైనింగ్​ తర్వాత నెలకు రూ.25,000 - 1,17,500 చెల్లిస్తారు.

మొత్తం ఖాళీలు- 660
ఇందులో డిప్లొమా ట్రెయినీ ఎలక్ట్రికల్ (DTE), సివిల్ (DTC), స‌ర్వే (DTS), జూనియ‌ర్ ఆఫీస‌ర్ ట్రెయినీ హెచ్ఆర్‌, ఎఫ్ అండ్ ఏ, స‌ర్వే పోస్టులు ఉన్నాయి.

రీజియ‌న్ లేదా ప్రాజెక్టు వారీగా పోస్టులు..
కార్పొరేట్ సెంట‌ర్‌- 21
ఈస్ట‌ర్న్ రీజియ‌న్-I (ER) - 2
ఈస్ట‌ర్న్ రీజియ‌న్-II (ER) - 16
ఒడిశా ప్రాజెక్టు- 32
నార్త్ ఈస్ట‌ర్న్ రీజియ‌న్- 33
నార్త‌ర్న్ రీజియ‌న్‌-I (NER)- 92
రాజ‌స్థాన్ ప్రాజెక్ట్‌- 42
నార్త‌ర్న్ రీజియ‌న్‌-II (NER)- 50
నార్త‌ర్న్ రీజియ‌న్‌-III (NER)-45
సౌథ‌ర్న్ రీజియ‌న్‌-I (SR)-47
సౌథ‌ర్న్ రీజియ‌న్‌-II (SR)-81
వెస్ట‌ర్న్ రీజియ‌న్‌-I (WR)-67
వెస్ట‌ర్న్ రీజియ‌న్‌-II (WR)-110

సీటీయూఐఎల్‌లో ఖాళీలు- 30
డీటీఈ- 16, డీటీసీ 6, జూనియ‌ర్ ఆఫీస‌ర్ ట్రైనీ హెచ్ఆర్‌ 4, జూనియ‌ర్ ఆఫీస‌ర్ ట్రెయినీ ఎఫ్ అండ్ ఏ 4

అర్హత : 70 శాతం మార్కులతో ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్​ (పవర్​), ఎలక్ట్రికల్​ అండ్​ ఎలక్ట్రానిక్స్, పవర్​ సిస్టమ్స్​, పవర్​ ఇంజినీరింగ్​ (ఎలక్ట్రికల్​) డిప్లొమా, సివిల్​ ఇంజినీరింగ్​ డిప్లొమా, ఇంటర్​ సీఏ/ సీఎంఏ, 60 శాతం మార్కులతో బీబీఏ / బీబీఎం/ బీబీఎస్​ చేసి ఉండాలి. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎంఏ పూర్తి చేసినవారికి అవకాశం లేదు. అభ్య‌ర్థులు 18 నుంచి 27 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్కులై ఉండాలి.

ఎంపిక విధానం

  • రాత పరీక్ష/ కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​, కంప్యూటర్​ స్కిల్​ టెస్టులతో స్కిల్​ టెస్టులతో ఉంటుంది.
  • పరీక్ష మల్టిపుల్​ చాయిస్​ విధానంలో 170 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం రెండు పార్టులుగా ఉంటుంది.
  • పార్ట్​-1లో 120 టెక్నికల్​ నాలెడ్జ్​ ప్రశ్నలు
  • పార్ట్​-2లో ఆప్టిట్యూడ్​ టెస్టు 50 మార్కులకు ఉంటుంది.
  • ప్ర‌తి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానికీ పావుమార్కు తగ్గిస్తారు.

రాత పరీక్ష లేదా కంప్యూటర్​ బేస్డ్​ టెస్టులో జనరల్​ అభ్యర్థులు 40 శాతం, ప్రత్యేక వర్గాలకు చెందిన వారు 30 శాతం మార్కులు సాధించాలి. అందులో 1:5 నిష్పత్తిలో కంప్యూటర్​ స్కిల్​ టెస్టుకు ఎంపిక చేస్తారు. ఇందులో జనరల్​ 40 శాతం, రిజర్వుడ్​ అభ్యర్థులు 30 శాతం కనీసార్హత మార్కులు రావాలి. సీబీటీ మార్కులతోనే తుది ఎంపిక ఉంటుంది. హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: జేటీటీ- సర్వే పోస్టుకు రూ.200, మిగిలిన పోస్టుల‌కు రూ.300 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికుల‌కు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 11
వెబ్​సైట్: http://www.powergrid.in/

Advertisement
Advertisement