New LPG Rule | గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అలర్ట్: బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు.. కేంద్రం సంచలన నిర్ణయం!
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు, రెండు బుకింగ్‌ల మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. సరఫరాలో గృహావసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రిఫైనరీలను ఆదేశించింది.
New LPG Rule | త్రినేత్ర.న్యూస్ : ఇరాన్ - అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం క్రమంగా గ్లోబల్ ఎనర్జీ సంక్షోభానికి దారితీస్తోంది. ఈ యుద్ధ పరిణామాల ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఎల్పీజీ (LPG) వంట గ్యాస్ బుకింగ్ నియమాల్లో కీలక మార్పులు చేసింది.
21 నుంచి 25 రోజులకు పెంపు
దేశంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు గ్యాస్ సిలిండర్ల (LPG Refill) బుకింగ్ మధ్య గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. రాబోయే ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరూ అక్రమంగా సిలిండర్లను నిల్వ చేయకుండా అడ్డుకునేందుకే ఈ ముందస్తు చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కమర్షియల్ కంటే గృహావసరాలకే పెద్దపీట
గ్యాస్ కొరత రాకుండా దేశంలోని అన్ని ఆయిల్ రిఫైనరీలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎల్పీజీ (LPG) ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని సూచించింది. ఉత్పత్తి చేసిన గ్యాస్‌ను వాణిజ్య (Commercial) లేదా పారిశ్రామిక అవసరాల కంటే.. ముందుగా గృహావసరాల (Domestic) కనెక్షన్లకే సరఫరా చేయాలని తేల్చి చెప్పింది. ఇదే కారణంతో బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లో హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
హార్ముజ్ జలసంధి దిగ్బంధనం.. కానీ ఆందోళన వద్దు
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) ని ఇరాన్ దిగ్బంధించింది. అయితే, కేవలం అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ తదితర పశ్చిమ దేశాల నౌకలను మాత్రమే అడ్డుకుంటామని ఇరాన్ ప్రకటించినప్పటికీ.. గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలపై తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే, భారతీయులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు భరోసా ఇస్తున్నారు.
"ఇతర దేశాలతో పోలిస్తే మన పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. పాకిస్థాన్‌లో ఏం జరుగుతోందో చూడండి. మన దేశంలో ప్రతి పెట్రోల్ పంప్ పనిచేస్తోంది. మన దగ్గర పెట్రోల్, డీజిల్‌తో పాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) నిల్వలు కూడా సరిపడా ఉన్నాయి" అని ఒక అధికారి స్పష్టం చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
ప్రస్తుతానికి ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 100 డాలర్ల వద్ద కొనసాగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. "అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 130 డాలర్లు దాటితే తప్ప.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు" అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. దేశంలో ఏ ఒక్క పెట్రోల్ బంక్‌లోనూ ఇంధన కొరత లేదని తేల్చిచెప్పాయి. గ్యాస్ వినియోగదారులు అకారణంగా ఆందోళన చెంది పానిక్ బుకింగ్స్ చేసుకోవద్దని ప్రభుత్వం సూచిస్తోంది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



