Miss India 2026 Winner | మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా బ్యూటీ.. ఎవరీ సాధ్వి సతీష్ సైల్?
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 విజేతగా గోవాకు చెందిన బ్యూటీ సాధ్వి సతీష్ సైల్ నిలిచారు. ఒడిశాలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. పోటీల్లో మహారాష్ట్రకు చెందిన రాజ్‌నందిని పవార్ మొదటి రన్నరప్‌గా నిలిచారు.
Miss India 2026 Winner | త్రినేత్ర.న్యూస్ : అందాల పోటీల్లో గోవా బ్యూటీ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఫెమినా మిస్ ఇండియా వరల్డ్-2026' కిరీటాన్ని గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ (Sadhvi Satish Sail) సొంతం చేసుకుంది. ఏప్రిల్ 18న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) వేదికగా జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే అత్యంత అట్టహాసంగా ముగిసింది.
దేశ నలుమూలల నుంచి వచ్చిన అందాల భామలను వెనక్కి నెట్టి సాధ్వి సతీష్ విజేతగా నిలిచింది. మునుపటి మిస్ ఇండియా విజేత నికితా పోర్వాల్.. సాధ్వి సతీష్‌కు ముత్యాలతో పొదిగిన అందాల కిరీటాన్ని అలంకరించారు. ఈ అద్భుత విజయంతో, రాబోయే 'మిస్ వరల్డ్ 2027' అంతర్జాతీయ పోటీల్లో భారతదేశం తరపున సాధ్వి ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన రాజ్‌నందిని పవార్ (Rajnandini Pawar) ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా.. కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ శ్రీ అద్వైత (Dr. Sree Advaita) సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ప్రముఖ యాంకర్ మనీష్ పాల్, సారా-జేన్ డయాస్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ యువ నటుడు ఇషాన్ ఖట్టర్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

మోడల్, సోషల్ సర్వీస్
మిస్ ఇండియాగా నిలిచిన సాధ్వి సతీష్ కేవలం మోడల్ మాత్రమే కాదు, సమాజ సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఆమె ఒక సామాజిక కార్యకర్తగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల కోసం, ముఖ్యంగా వినికిడి, మాట్లాడటంలో లోపాలు ఉన్న చిన్నారుల ఆరోగ్య అవసరాల కోసం నిధులు సేకరిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు.
తన విజయంపై సాధ్వి ఆనందం వ్యక్తం చేస్తూ.. "ఒక సాధారణ పట్టణం నుంచి వచ్చి ఇలా గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబడటం నాకు అతిపెద్ద సవాలుగా అనిపించింది. ఇతరుల విజయాలు చూసినప్పుడు నా సామర్థ్యంపై నాకే సందేహాలు వచ్చేవి. కానీ నా అంతర్గత ఆలోచనలను మార్చుకున్న తర్వాత నాలో మార్పు వచ్చింది. ఇతర మహిళలతో నన్ను నేను పోల్చుకోవడం మానేసి, వారిని ప్రోత్సహించడం నేర్చుకున్నాను" అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమంటే మన పట్టుదలను ప్రపంచానికి చాటిచెప్పడమే. సవాళ్లను ఎదుర్కొని చిత్తశుద్ధితో ముందుకు సాగడమే" అని ఆమె అన్నారు.

ఫినాలేలో ఆకట్టుకున్న ఫ్యాషన్ డ్రెస్సులు
టాప్-3గా నిలిచిన ఈ అందాల భామలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్‌లో తమ తెలివితేటలతోనే కాకుండా, తమ ఫ్యాషన్ సెన్స్‌తోనూ అబ్బురపరిచారు.
సాధ్వి సతీష్ సైల్ (గోవా): ప్రముఖ డిజైనర్ లేబుల్ వజానేహ్ (Vazaneh) రూపొందించిన సిల్వర్ అండ్ బ్లాక్ మోనోక్రోమటిక్ గౌనులో సాధ్వి మెరిసిపోయారు. స్లీవ్‌లెస్, హై-నెక్ డిజైన్‌తో ఉన్న ఈ డ్రెస్‌కు సిల్వర్ మెటాలిక్ బీడ్‌వర్క్ హైలైట్‌గా నిలిచింది.
ఫస్ట్ రన్నరప్ రాజ్‌నందిని పవార్ (మహారాష్ట్ర): ఈమె ఫ్లోరల్ వైన్ ఎంబ్రాయిడరీతో కూడిన అందమైన బ్లష్-పింక్ హాల్టర్ స్టైల్ గౌనులో మోడ్రన్ ప్రిన్సెస్‌లా కనిపించి ఆకట్టుకున్నారు.
సెకండ్ రన్నరప్ శ్రీ అద్వైత (యూనియన్ టెరిటరీ): గోల్డ్ కలర్ షిమ్మరింగ్ ఈవినింగ్ గౌనులో శ్రీ అద్వైత తళుక్కుమన్నారు. షీర్ స్లీవ్స్‌తో కూడిన ఈ గౌను ఆమెకు రాయల్ అండ్ మోడ్రన్ లుక్‌ను అందించింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



