త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Terrorism | సోష‌ల్ మీడియాలో ఉగ్ర‌వాద ప్ర‌చారం చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్టు

Terrorism | పాకిస్థాన్‌కు చెందిన వివిధ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలు పెట్టుకుని సోష‌ల్ మీడియాలో ఉగ్ర‌వాద ప్ర‌చారం చేస్తున్న మ‌హారాష్ట్రకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అయాన్ షేక్‌ను అక్క‌డి యాంటీ టెర్ర‌రిజం స్క్వాడ్ అధికారులు శుక్ర‌వారం అదుపులోకి తీసుకున్నారు.

A

National | Published On Mar 6, 2026, 5.20 pm IST

Terrorism | సోష‌ల్ మీడియాలో ఉగ్ర‌వాద ప్ర‌చారం చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్టు
Advertisement

Terrorism | త్రినేత్ర‌.న్యూస్‌: పాకిస్థాన్‌కు చెందిన వివిధ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలు పెట్టుకుని సోష‌ల్ మీడియాలో ఉగ్ర‌వాద ప్ర‌చారం చేస్తున్న మ‌హారాష్ట్రకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి అయాన్ షేక్‌ను అక్క‌డి యాంటీ టెర్ర‌రిజం స్క్వాడ్ అధికారులు శుక్ర‌వారం అదుపులోకి తీసుకున్నారు. ఆయా సంస్థ‌ల నుంచి వ‌చ్చిన ఎన్‌క్రిప్టెడ్ స‌మాచారాన్ని అత‌డు డీకోడ్ చేసి, సోష‌ల్ మీడియాలో ఇత‌ర విద్యార్థుల‌కు షేర్ చేస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు. అత‌డి మొబైల్‌, ల్యాప్‌టాప్‌, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. యువ‌త‌, విద్యార్థుల‌ను ఉగ్ర‌వాదంవైపు ప్రోత్స‌హించ‌డంతో పాటు ఉగ్ర కార్య‌క‌లాపాల‌కు నిధులు స‌మ‌కూర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అధికారులు నిర్ధారించుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మ‌రో ఇద్ద‌రు యువ‌కుల‌ను సైతం అదుపులోకి తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement