Delhi Lutyens Bungalow | ఢిల్లీలో భారీ డీల్: రూ.1000 కోట్లకు రాజుగారి బంగ్లా..! కొనేది ఎవరో తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఓ చారిత్రక బంగ్లా అమ్మకానికి వచ్చింది. దీని ధర అక్షరాలా రూ. 1000 కోట్లు. ఇంతకీ ఆ బంగ్లా ఎవరిది? ఎందుకు అంత ధర?
Delhi Lutyens Bungalow | త్రినేత్ర.న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత సంపన్న ప్రాంతమైన 'లుటియన్స్ ఢిల్లీ' (Lutyens’ Delhi)లో మరో భారీ రియల్ ఎస్టేట్ డీల్ చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ (Tehri Garhwal) రాజవంశానికి చెందిన మహారాజు మనుజేంద్ర షా (Manujendra Shah), తన అధీనంలో ఉన్న భారీ బంగ్లాను విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ.1,000 కోట్లుగా ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఈ బంగ్లాకు భారీ చరిత్రే ఉంది. బ్రిటీష్ హయాంలో నిర్మాణం జరిగిన ఈ ఎస్టేట్‌లోని కొన్ని బిల్డింగ్స్‌ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా.. మనుజేంద్ర షా మహారాజు తన నివాసం కోసం ఈ బంగ్లాను తన వద్దే ఉంచుకున్నారు.
డీల్ వివరాలు ఇవే
భగవాన్ దాస్ రోడ్డులో ఉన్న 3.2 ఎకరాల విస్తీర్ణంలో 12,950 చదరపు మీటర్లలో ఉన్న బంగ్లా అది. తెహ్రీ గర్వాల్ మహారాజు, మాజీ ఎంపీ మనుజేంద్ర షా ఈ బంగ్లా యజమాని. సుప్రీంకోర్టుకి, ఇండియా గేట్‌కి అత్యంత సమీపంలో ఉన్న ఈ బంగ్లాను మనుజేంద్ర షా అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి ఓ వ్యాపారవేత్త దీన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకు అంత డిమాండ్?
లుటియన్స్ ఢిల్లీ అనేది దేశంలోని అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన ప్రాంతం. ఇక్కడ సాధారణంగా ఆస్తుల అమ్మకాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఈ బంగ్లా ఉన్న ప్రాంతం (LBZ - Lutyens Bungalow Zone) కావడంతో, దీనికి డెవలపర్ల నుంచి విపరీతమైన పోటీ నెలకొంది. ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, అక్కడ అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టును నిర్మించడానికి పలువురు ప్రముఖ బిల్డర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ బంగ్లాలో తెహ్రీ గర్వాల్ వంశానికి చెందిన బీజేపీ ఎంపీ మల రాజ్య లక్ష్మీ షా నివసిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ చరిత్రలో రికార్డ్?
ప్రస్తుతం ఈ డీల్ ప్రాథమిక దశలోనే ఉందని, లావాదేవీ పూర్తయితే ఇది ఢిల్లీ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాలలో ఒకటిగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు. గతంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అదార్ పూనావాలా కూడా ఢిల్లీలో రూ.1400 కోట్లతో ఓ మ్యాన్షన్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ డీల్ కూడా అదే స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.
ఈ ఆస్తిని విక్రయించడానికి సంబంధించి లావాదేవీల సలహాదారుగా మల్టీనేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



