త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Passport Fee Hike 2026 | పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కేంద్రం భారీ షాక్

విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫీజులను భారీగా పెంచుతూ కేంద్ర విదేశాంగ శాఖ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

J

National | Published On Jun 25, 2026, 11.00 pm IST

Indian Passport Fee Hike 2026 | పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కేంద్రం భారీ షాక్
Advertisement
  • కేంద్ర విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్ నిబంధనల సవరణ (Passports Amendment Rules, 2026) ద్వారా అప్లికేషన్ ఫీజులు భారీగా పెంపు
  • సాధారణ 36 పేజీల కొత్త లేదా రీఇష్యూ పాస్‌పోర్ట్ నార్మల్ ఫీజు రూ.2,500 కు, తత్కాల్ ఫీజు రూ.5,000 కు పెంపు
  • 60 పేజీల జంబో పాస్‌పోర్ట్ కావాలంటే ఇకపై నార్మల్ కింద రూ.3,500, తత్కాల్ కింద రూ.6,000 చెల్లించాల్సిందే
  • కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఈ కొత్త ఫీజుల పెంపు జూలై 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి

Indian Passport Fee Hike 2026 | త్రినేత్ర.న్యూస్ : మీరు కొత్తగా పాస్‌పోర్ట్ (Passport) కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? లేదా మీ పాత పాస్‌పోర్ట్‌ను రీఇష్యూ (Reissue) చేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. దేశంలో పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫీజులను భారీగా పెంచుతూ కేంద్ర విదేశాంగ శాఖ (Ministry of External Affairs) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. సవరించిన పాస్‌పోర్ట్ చార్జీలు జూలై 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. తాజా సవరణల ప్రకారం నార్మల్, తత్కాల్ (Tatkaal) ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.

పెరిగిన కొత్త ఫీజుల వివరాలు (18 ఏళ్లు పైబడిన వారికి)

అధికారిక షెడ్యూల్ ప్రకారం పెరిగిన చార్జీల వివరాలు ఇవి.

36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ (ఫ్రెష్ లేదా రీఇష్యూ): దీని కోసం ఇకపై నార్మల్ ఫీజు (Normal Fee) కింద రూ.2,500 చెల్లించాలి. ఒకవేళ అర్జెంట్‌గా తత్కాల్‌లో కావాలనుకుంటే రూ.5,000 సమర్పించుకోవాలి.

60 పేజీల పాస్‌పోర్ట్ (ఫ్రెష్ లేదా రీఇష్యూ): జంబో బుక్‌లెట్ అవసరమయ్యే వారికి నార్మల్ ఫీజు రూ.3,500 కాగా, తత్కాల్ ఫీజును ఏకంగా రూ.6,000 కు పెంచారు.

పోగొట్టుకుంటే ఫైన్ డబుల్

ఒకవేళ మీ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా లేదా అది పాడైపోయినా (Damaged), దాని స్థానంలో డూప్లికేట్ పాస్‌పోర్ట్ పొందడం ఇప్పుడు మరింత భారం కానుంది.

36 పేజీల బుక్‌లెట్ కోసం నార్మల్‌గా రూ.5,000, తత్కాల్‌లో అయితే రూ.7,500 చెల్లించాలి.

అదే 60 పేజీల బుక్‌లెట్ కావాలంటే నార్మల్ కింద రూ.6,000, తత్కాల్ కింద ఏకంగా రూ.8,500 వసూలు చేయనున్నారు.

మైనర్లకూ (18 ఏళ్ల లోపు వారికి) కొత్త చార్జీలు

చిన్నారుల పాస్‌పోర్ట్ ఫీజులను కూడా ప్రభుత్వం సవరించింది. మైనర్లకు 36 పేజీల కొత్త లేదా రీఇష్యూ పాస్‌పోర్ట్ కావాలంటే నార్మల్ ఫీజు రూ.1,750 గా, తత్కాల్ ఫీజు రూ.4,250 గా నిర్ణయించారు. ఒకవేళ మైనర్ల పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే కొత్త దాని కోసం నార్మల్‌గా రూ.4,250, తత్కాల్‌లో రూ.6,750 కట్టాల్సి ఉంటుంది.

ఇతర సర్వీసుల ఫీజులు కూడా పైకే..

పాస్‌పోర్ట్‌కు సంబంధించిన మిస్సిలేనియస్ సర్వీసెస్ (Miscellaneous Services) చార్జీలను కూడా ప్రభుత్వం సవరించింది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC), పాస్‌పోర్ట్ సరెండర్ సర్టిఫికేట్ లేదా గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ (GEP) వెరిఫికేషన్ వంటి సేవలకు ఇకపై రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. కాబట్టి, జూన్ 30 లోపు పాత ధరలకే అప్లై చేసుకునే అవకాశం ఉండటంతో, పాస్‌పోర్ట్ అవసరమైన వారు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

Advertisement

తాజావార్తలు

Advertisement