త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Surathkal Suicide Case | ప్రేమ పేరుతో గర్భవతిని చేసి మోసం.. 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

మంగళూరు సమీపంలోని సూరత్కల్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయి గర్భవతినయ్యానంటూ ఓ మైనర్ బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

J

Crime | Published On Jun 25, 2026, 11.55 pm IST

Surathkal Suicide Case | ప్రేమ పేరుతో గర్భవతిని చేసి మోసం.. 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
Advertisement
  • దక్షిణ కన్నడ జిల్లా సూరత్కల్‌లో 17 ఏళ్ల మైనర్ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య
  • ప్రేమ పేరుతో అనీష్ పూజారి అనే యువకుడు తనను గర్భవతిని చేసి మోసం చేశాడని, హిందూ సంఘాలు కూడా సాయం చేయలేదని ఆమె సూసైడ్ నోట్‌లో ఆవేదన 
  • నిందితుడిపై పోక్సో (POCSO), రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు 
  • పోస్ట్‌మార్టం తర్వాతే గర్భం దాల్చిన విషయంపై స్పష్టత వస్తుందని, డీఎన్ఏ (DNA) పరీక్ష కోసం పిండాన్ని భద్రపరచాలని డాక్టర్లకు పోలీసుల సూచన

Surathkal Suicide Case | త్రినేత్ర.న్యూస్ : దక్షిణ కన్నడ (Dakshina Kannada) జిల్లా మంగళూరు సమీపంలోని సూరత్కల్ (Surathkal) కటిపల్లా ప్రాంతంలో దారుణం వెలుగుచూసింది. జూన్ 23న సాయంత్రం 4 గంటల సమయంలో 17 ఏళ్ల మైనర్ బాలిక తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తుళు (Tulu) భాషలో ఆమె రాసిన సూసైడ్ నోట్ తీవ్ర కలకలం రేపుతోంది.

ఫస్ట్ ఇయర్ పీయూసీ (First-year PUC) అనగా 11వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి రాగానే ఈ దారుణానికి ఒడిగట్టింది. "అమ్మా, నేను తప్పు చేశాను.. నన్ను క్షమించు. నేను ఇక బతకలేను" అంటూ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. బంట్వాల్‌కు (Bantwal) చెందిన అనీష్ పూజారి (Anish Poojary) అనే యువకుడు ప్రేమ పేరుతో తనను నమ్మించి మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ప్రేమ పేరుతో దగ్గరై తనను గర్భవతిని (Pregnant) చేసి ఆ తర్వాత వదిలేశాడని ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

Image

"నాకు హిందూ సంఘాలు కూడా ఎలాంటి సాయం చేయలేదు. నన్ను మోసం చేసిన వ్యక్తి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు" అని బాలిక ఆ లేఖలో ఆరోపించింది. అలాగే "నా లాగా మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదు" అని ఆమె రాసిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. రాత్రి 11 గంటల సమయంలో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై మంగళూరు పోలీస్ కమిషనర్ సుధీర్ రెడ్డి స్పందించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు అనీష్ పూజారిపై రాత్రి 1 గంట సమయంలో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశామని తెలిపారు. నిందితుడిపై పోక్సో (POCSO Act 2012), అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి కఠిన సెక్షన్ల కింద కేసు బుక్ చేశామన్నారు. నిందితుడు ఓ మతపరమైన సంస్థతో సంబంధం ఉన్నవాడని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను రంగంలోకి దించామన్నారు.

Image

బాలిక గర్భవతి అన్న విషయంపై పోస్ట్‌మార్టం (Postmortem) నివేదిక తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుందని వైద్యులు పోలీసులకు తెలిపారు. ఒకవేళ పిండం ఉంటే, దాన్ని డీఎన్ఏ (DNA) పరీక్షల కోసం భద్రపరచాలని పోలీసులు డాక్టర్లను కోరారు.

Advertisement
Advertisement