త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gas Crisis Hits Eateries | గ్యాస్ కష్టాలు: రేపటి నుంచి బెంగళూరులో హోటళ్లు బంద్.. ముంబైలోనూ తీవ్ర కొరత!

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారతదేశంపై పడుతోంది. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి బెంగళూరులో హోటళ్లు మూసివేస్తున్నట్లు బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అటు ముంబైలోనూ వంట గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది.

J

National | Published On Mar 9, 2026, 9.22 pm IST

Gas Crisis Hits Eateries | గ్యాస్ కష్టాలు: రేపటి నుంచి బెంగళూరులో హోటళ్లు బంద్.. ముంబైలోనూ తీవ్ర కొరత!
Advertisement

Gas Crisis Hits Eateries | త్రినేత్ర.న్యూస్ : అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ వాతావరణం (వార్ ఎఫెక్ట్) భారత్‌లోని సామాన్యుల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ (LPG) సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో హాస్పిటాలిటీ రంగం కుదేలవుతోంది. ఐటీ రాజధాని బెంగళూరుతో పాటు, ఆర్థిక రాజధాని ముంబైలో గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి.

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రేపటి (మంగళవారం) నుంచి తమ రెస్టారెంట్లను, హోటళ్లను నిర్వహించలేమని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ (Bangalore Hotels Association) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం మార్చి 9, 2026 ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోవడంతో వంట చేయడం అసాధ్యంగా మారిందని అసోసియేషన్ తెలిపింది.

సామాన్యులపై ప్రభావం: హోటల్ పరిశ్రమను అత్యవసర సేవల (Essential Services) కింద పరిగణిస్తారు. హోటళ్లు మూతపడితే.. వాటిపై ఆధారపడిన లక్షలాది మంది సామాన్య ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు, వైద్య సిబ్బందికి రోజువారీ భోజనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

కేంద్రానికి విజ్ఞప్తి: రాబోయే 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని చమురు సంస్థలు గతంలో హామీ ఇచ్చాయని, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా నిలిపివేయడం హోటల్ పరిశ్రమకు పెద్ద దెబ్బ అని అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు తక్షణమే జోక్యం చేసుకుని కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరారు.

https://x.com/dp_satish/status/2031003821959459094

ముంబైని కమ్మేస్తున్న 'గ్యాస్' కొరత

మరోవైపు మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ వంట గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చింది.

8 రోజులకు వెయిటింగ్: నగరంలో ఎల్పీజీ (LPG) వంట గ్యాస్ రీఫిల్ కోసం నిరీక్షణ సమయం ఏకంగా ఎనిమిది రోజులకు చేరుకుంది.

ఆగిపోయిన సరఫరా: హోటళ్లు, రెస్టారెంట్లకు వాడే కమర్షియల్ సిలిండర్ల సరఫరా ముంబైలో కూడా పూర్తిగా నిలిచిపోయిందని డీలర్లు చెబుతున్నారు.

భారీ సంక్షోభం: గ్యాస్ సరఫరా లేకపోవడంతో, ముంబైలోని వేలాది రెస్టారెంట్లు, చిన్నపాటి తినుబండారాల వ్యాపారాలు మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఇది నగరంలోని ఫుడ్ ఇండస్ట్రీకి అతిపెద్ద సంక్షోభంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధ పరిణామాల కారణంగా నెలకొన్న ఈ ఇంధన కొరతను ప్రభుత్వాలు ఎంత త్వరగా పరిష్కరిస్తాయో వేచి చూడాలి.

Advertisement
Advertisement