త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DRI e-cigarette Seizure | చైనా నుంచి ఫర్నిచర్ పేరుతో భారీ స్మగ్లింగ్: రూ.120 కోట్ల విలువైన ఈ-సిగరెట్లు సీజ్

ఫర్నిచర్ ముసుగులో చైనా నుంచి భారత్‌లోకి అక్రమంగా రవాణా అవుతున్న రూ.120 కోట్ల విలువైన ఈ-సిగరెట్లను డీఆర్ఐ అధికారులు భారీ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు.

J

National | Published On May 21, 2026, 4.19 pm IST

DRI e-cigarette Seizure | చైనా నుంచి ఫర్నిచర్ పేరుతో భారీ స్మగ్లింగ్: రూ.120 కోట్ల విలువైన ఈ-సిగరెట్లు సీజ్
Advertisement

DRI e-cigarette Seizure | త్రినేత్ర.న్యూస్ : నిషేధిత ఉత్పత్తుల అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఉక్కుపాదం మోపింది. గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు పోర్టులు, ఎయిర్‌పోర్టులలో భారీ ఆపరేషన్ చేపట్టి.. స్మగ్లింగ్ అవుతున్న దాదాపు 3 లక్షల ఈ-సిగరెట్లను (e-cigarettes/vapes) పట్టుకుంది. వీటి విలువ మార్కెట్‌లో సుమారు రూ. 120 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

కస్టమ్స్ కళ్లుగప్పి.. చైనా కుట్ర

కస్టమ్స్ (customs) అధికారుల కళ్లుగప్పి భారత్‌లోకి ఈ-సిగరెట్లను ఇంపోర్ట్ (import) చేసేందుకు స్మగ్లర్లు భారీ స్కెచ్ వేశారు. కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు.. అనుమానాస్పద కన్‌సైన్‌మెంట్లను ట్రాక్ చేసి అడ్డుకున్నారు. వీటిని లోతుగా తనిఖీ చేయగా వివిధ బ్రాండ్స్ (brands), ఫ్లేవర్స్ (flavours), స్పెసిఫికేషన్లతో కూడిన వేప్స్ భారీగా బయటపడ్డాయి.

ఫర్నిచర్ ముసుగులో స్మగ్లింగ్

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పట్టుబడిన ఈ నిషేధిత ఈ-సిగరెట్లన్నీ చైనా నుంచే రావడం గమనార్హం. "ఫర్నిచర్", "మెటల్ చైర్ పార్ట్స్" (Metal chair parts) పేరుతో వీటిని అత్యంత పకడ్బందీగా ప్యాక్ చేసి మన దేశంలోకి అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు విచారణలో గుర్తించారు.

భారత్‌లో ఈ-సిగరెట్లపై బ్యాన్

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 2019లోనే ఈ-సిగరెట్లపై (vapes) కఠిన నిషేధం విధించింది. 'ఈ-సిగరెట్ల నిషేధ చట్టం-2019' ప్రకారం.. వీటి ఉత్పత్తి, తయారీ, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్, రవాణా, విక్రయం, నిల్వతో పాటు ప్రకటనలు ఇవ్వడం కూడా పూర్తిగా చట్టవిరుద్ధం. యువతను క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి రక్షించేందుకే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయినా సరే, చైనా నుంచి దొడ్డిదారిన ఈ వ్యసనాన్ని దేశంలోకి చొప్పించేందుకు స్మగ్లర్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement
Advertisement