కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న నిరసనలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. బెళగావిలో ఉన్న సువర్ణ సౌధలో శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రైతుల సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళనను ఉద్దేశించి శివకుమార్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై కాకుండా కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని హితవు పలికారు. ఉత్తర కర్ణాటకపై చర్చ జరగాలి ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. ఉత్తర కర్ణాటక సమస్యల గురించి బీజేపీ ఎమ్మెల్యేలు చర్చించాలని మేము కోరుకుంటున్నాము. రాజకీయ నిరసనలు చేయడం కాదు.. ఆ ప్రాంత అభివృద్ధి గురించి కూడా మాట్లాడాలని వ్యాఖ్యానించారు. కేంద్రం విఫలం రైతుల సమ్యలపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదు.. రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. రైతులకు ఎందుకు సహాయం చేయడం లేదో బీజేపీ నేతలు చర్చించాలి. చెరకు ధరల లేక రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దీనిపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది రైతుల సంక్షేమం కోసం కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులకు అండగా నిలిచింది.. భవిష్యత్తులోనూ నిలుస్తుంది. వారికి మద్దతు ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? బీజేపీ నేతలు నిజంగా రైతుల పక్షపాతులైతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పాలని డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. #WATCH | Belagavi | On BJP MLAs to protest against the state government in the Suvarna Soudha today, Karnataka Dy CM DK Shivakumar says, "We want them to discuss about North Karnataka. We want them to discuss why the Central government is not helping the farmers. There is a big… pic.twitter.com/ifYIJ9TWDD — ANI (@ANI) December 9, 2025