త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MEGHALAYA COLE MINE | బొగ్గు గనిలో పేలుడు.. 16 మంది కూలీల దుర్మ‌ర‌ణం

Meghalaya Coal Mine | మేఘాలయలోని బొగ్గుగని (Meghalaya Coal Mine) లో గురువారం సాయంత్రం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అందులో పేలుడు సంభవించడంతో 16 మంది కూలీలు దుర్మ‌ర‌ణం చెందారు. తూర్పు జైంతియా హిల్స్‌ జిల్లాలో ఈ ఘటన జ‌రిగింది.

S

National | Published On Feb 5, 2026, 7.18 pm IST

MEGHALAYA COLE MINE | బొగ్గు గనిలో పేలుడు.. 16 మంది కూలీల దుర్మ‌ర‌ణం
Advertisement

- మేఘాల‌యాలో ఘ‌ట‌న‌
- కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

త్రినేత్ర‌.న్యూస్‌: మేఘాలయలోని బొగ్గుగని (Meghalaya Coal Mine)లో గురువారం సాయంత్రం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అందులో పేలుడు సంభవించడంతో 16 మంది కూలీలు దుర్మ‌ర‌ణం చెందారు. తూర్పు జైంతియా హిల్స్‌ జిల్లాలో ఈ ఘటన జ‌రిగింది. పోలీసులు ప్రకారం వివ‌రాలిలా ఉన్నాయి. గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతోన్న సమయంలో ఈ పేలుడు సంభ‌వించింది. దాంతో కూలీలు అందులో చిక్కుకుపోయారు. వారిలో ఎక్కువమంది అసోంకు చెందినవారిగా వార్త‌లు వ‌స్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనగిస్తున్నారు. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. అయితే పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు

ర్యాట్ హోల్ మైనింగ్ త‌వ్వ‌కాల‌పై నిషేధం..

మేఘాలయలో ర్యాట్‌హోల్ మైనింగ్‌, అశాస్త్రీయ పద్ధతుల్లో తవ్వకాలను 2014లోనే జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) నిషేధించింది. సమాంతరంగా సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసే పద్ధతినే ర్యాట్‌ హోల్‌ మైనింగ్ (Rat Hole mining)గా వ్యవహరిస్తారు. ఇలా నేలలో ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్‌ హోల్‌గా పేర్కొంటారు. సుమారు నాలుగు అడుగుల వెడల్పుతో ఇది ఉంటుంది. కేవలం ఒక మనిషి మాత్రమే వెళ్లగలడు. కాగా ఎన్‌జీటీ నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.

మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం..

త‌ర‌చూ జ‌రుగుతున్న బొగ్గు గ‌ని పేలుడు ఘ‌ట‌న‌లో తీవ్ర ఆందోళ‌న‌లు క‌లిగిస్తున్నాయి. ప్ర‌భుత్వాలు మాత్రం త‌మ‌కు ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించినా మొద్దు నిద్ర‌ వీడ‌టం లేదు. తాజాగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. బాధిత కుటుంబ స‌భ్యులు ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశానికి చేరుకుంటున్నారు. ఎక్స్‌గ్రేషియాల‌తో స‌రిపెట్టి చేతులు దులుపుకుంటున్నార‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు. ఇక‌నైనా ప్ర‌భుత్వాల తీరు మారాల‌ని కోరుతున్నారు.

 

Advertisement
Advertisement