India Vs Zimbabwe | షఫాలీ విధ్వంసం.. 3-0 తేడాతో భారత్ క్లీన్‌స్వీప్!
India Vs Zimbabwe | భారత మహిళల జట్టు జింబాబ్వేపై వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో షఫాలీ వర్మ (51 నాటౌట్; 26 బంతుల్లో), ప్రతికా రావల్ (59 నాటౌట్) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 17 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో 33 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది.
India Vs Zimbabwe | భారత మహిళల జట్టు జింబాబ్వేపై వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో షఫాలీ వర్మ (51 నాటౌట్; 26 బంతుల్లో), ప్రతికా రావల్ (59 నాటౌట్) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 17 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో 33 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది.
రిచా ఘోష్ రికార్డును సమం చేసిన షఫాలీ
షఫాలీ వర్మ తన దూకుడైన బ్యాటింగ్‌తో అరుదైన ఘనత సాధించింది. కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని మహిళల వన్డేల్లో భారత తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసింది. 2022లో న్యూజిలాండ్‌పై రిచా ఘోష్ 26 బంతుల్లో సాధించిన ఫిఫ్టీని సమం చేసింది. ఈ జాబితాలో స్మృతి మంధాన అగ్రస్థానంలో ఉంది. 2025లో ఢిల్లీలో ఆస్ట్రేలియాపై ఆమె కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించింది. 22 ఏళ్ల షఫాలీ ఈ సిరీస్‌లోనే తన వ్యక్తిగత రికార్డును మెరుగుపరుచుకుంది. గతంలో జింబాబ్వేపై 29 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ఆమె.. తాజాగా 26 బంతుల్లోనే ఆ మార్కును అందుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో అజేయంగా 51 పరుగులు చేసి భారత్ విజయాన్ని వేగవంతం చేసింది.
ఆదిలో వికెట్.. ఆపై పరుగుల వరద
132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యస్తికా భాటియా రెండో బంతికే డకౌటైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్.. ప్రతికా రావల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. హర్లీన్ 19 బంతుల్లో 19 పరుగులు చేసి ఔటైంది. ఈ దశలో షఫాలీ, ప్రతికా కలిసి జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. షఫాలీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడగా.. ప్రతికా నిలకడగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ప్రతికా 59 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, షఫాలీ 51 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరూ భారత్‌ను సునాయాస విజయానికి చేర్చారు.
వైష్ణవి శర్మకు ఐదు వికెట్లు
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల ధాటికి 39.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్‌ప్లేలోనే జింబాబ్వే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా కోలుకోలేకపోయింది. భారత యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ 39 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ వన్డేల్లో ఆమెకిదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. సయాలి సట్ఘరే 11 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్ 23 పరుగులిచ్చి మరో రెండు వికెట్లు పడగొట్టింది. జింబాబ్వే తరఫున మోడెస్టర్ ముపచిక్వా 37, కెప్టెన్ జోసెఫిన్ న్కోమో 35, చియెడ్జా ధురురు 20 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
టీ20, వన్డే సిరీస్‌లు భారత్ కైవసం
ఈ పర్యటనలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగించింది. తొలుత టీ20 సిరీస్‌ను గెలుచుకున్న భారత్.. తాజాగా వన్డే సిరీస్‌నూ 3-0తో సొంతం చేసుకుంది. మరోవైపు జింబాబ్వే రెండు ఫార్మాట్లలోనూ ఒక్క విజయం సాధించకుండానే పర్యటనను ముగించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Minister Uttam | కరువును ఎదుర్కొనేందుకు అఖిలపక్ష సూచనలతో కార్యాచరణ
- ●Balmuri Induja Complaint KTR | కేటీఆర్‌పై హైదరాబాద్ సీపీకి బల్మూర్ ఇందుజా ఫిర్యాదు
- ●Sai Pallavi | సాయిపల్లవికి బిగ్ టెస్ట్.. రెండు సినిమాలు హిట్ అయితేనే..!
- ●KTR Defamation Case | కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయొద్దు.. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లపై కోర్టు సీరియస్
- ●Tandur Red Gram Australia Export | సరిహద్దులు దాటిన తాండూరు కంది ఘుమఘుమలు.. ఆస్ట్రేలియాకు తొలి ఎగుమతి ప్రారంభం
- ●Samyuktha | సంయుక్తకు ఇదేం పరీక్ష..! సినిమాలన్నీ రెడీ.. రిలీజ్ డిలే..!

Minister Uttam | కరువును ఎదుర్కొనేందుకు అఖిలపక్ష సూచనలతో కార్యాచరణ

Balmuri Induja Complaint KTR | కేటీఆర్‌పై హైదరాబాద్ సీపీకి బల్మూర్ ఇందుజా ఫిర్యాదు

Sai Pallavi | సాయిపల్లవికి బిగ్ టెస్ట్.. రెండు సినిమాలు హిట్ అయితేనే..!

KTR Defamation Case | కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయొద్దు.. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లపై కోర్టు సీరియస్




