త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBSE New Rules 2026 | సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్: 9, 10 తరగతులకు ‘3 భాషలు’ తప్పనిసరి.. జూలై 1 నుంచే కొత్త రూల్స్!

సీబీఎస్ఈ (CBSE) తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. జూలై 1 నుంచి మూడు భాషల విధానాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త రూల్ పూర్తి వివరాలివే!

J

National | Published On May 16, 2026, 9.30 pm IST

CBSE New Rules 2026 | సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్: 9, 10 తరగతులకు ‘3 భాషలు’ తప్పనిసరి.. జూలై 1 నుంచే కొత్త రూల్స్!
Advertisement

CBSE New Rules 2026 | త్రినేత్ర.న్యూస్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుబంధ స్కూళ్లలో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు అలర్ట్. 2026-27 విద్యా సంవత్సరం నుంచి లాంగ్వేజ్ సిస్టమ్‌లో (Language Scheme) బోర్డు కీలక మార్పులు చేసింది. ఇకపై తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు కచ్చితంగా మూడు భాషలను చదవాలనే నిబంధన విధించింది. ఈ మేరకు మే 15, 2026న ఒక సర్క్యులర్ జారీ చేసింది. జాతీయ విద్యా విధానం (NEP 2020), నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ (NCF-SE 2023) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రివైజ్డ్ స్ట్రక్చర్‌ను సిద్ధం చేసినట్లు బోర్డు వెల్లడించింది.

రెండు భారతీయ భాషలు మస్ట్

తాజా నోటిఫికేషన్ ప్రకారం.. జూలై 1, 2026 నుంచి 9, 10 తరగతుల విద్యార్థులు R1, R2, R3 అనే మూడు భాషలను (Three Languages) చదవడం తప్పనిసరి. ఇందులో ప్రధానమైన కండిషన్ ఏంటంటే.. ఈ మూడింటిలో కనీసం రెండు భాషలు స్థానిక భారతీయ భాషలై ఉండాలి.

ఒకవేళ ఏ విద్యార్థి అయినా ఫారిన్ లాంగ్వేజ్ (Foreign Language) చదవాలనుకుంటే.. మిగిలిన రెండు భాషలు కచ్చితంగా దేశీయ భాషలై ఉండాలి. లేదా ఆ విదేశీ భాషను అదనంగా నాలుగో భాషగా (Fourth language) ఎంచుకునే వెసులుబాటును కూడా కల్పించారు. 2026-27 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి ఇటీవల విడుదలైన NCERT సిలబస్‌ను రివ్యూ చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు CBSE స్పష్టం చేసింది. ఏప్రిల్‌లోనే అకడమిక్ సెషన్ ప్రారంభమైనందున, దీనిని దశలవారీగా అమలు చేయనున్నారు.

ప్రస్తుతానికి 6వ తరగతి పుస్తకాలే

భాషా సామర్థ్యాలకు (చదవడం, రాయడం, మాట్లాడటం, గ్రామర్) సంబంధించి మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్ ఎడ్యుకేషన్ మధ్య దాదాపు 75 నుంచి 80 శాతం పోలికలు ఉన్నాయని సర్క్యులర్ హైలైట్ చేసింది.

అందుకే 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా R3 టెక్స్ట్‌బుక్స్ (Textbooks) వచ్చే వరకు, ప్రస్తుత 2026-27 విద్యా సంవత్సరానికి వారు 6వ తరగతి R3 పుస్తకాలనే ఉపయోగించాలని బోర్డు సూచించింది. వీటికి అదనంగా స్థానిక కథలు, కవితలు, ఇతర సాహిత్య అంశాలను జోడించి బోధించాలని స్కూళ్లను ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి గైడ్‌లైన్స్‌ను జూన్ 15, 2026 నాటికి విడుదల చేయనున్నారు. జూలై 1లోపు 19 షెడ్యూల్డ్ భాషలకు సంబంధించిన 6వ తరగతి R3 పుస్తకాలను స్కూళ్లకు అందజేస్తామని బోర్డు వెల్లడించింది.

లాంగ్వేజ్ టీచర్ల కొరత ఉంటే ఏం చేయాలి?

ఈ కొత్త విధానం అమలుతో కొన్ని స్కూళ్లలో భారతీయ భాషలు బోధించే అర్హత కలిగిన ఉపాధ్యాయుల (Language Teachers) కొరత ఏర్పడే అవకాశం ఉందని CBSE గుర్తించింది. ఈ సమస్యను అధిగమించేందుకు స్కూళ్లకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది. సహోదయ (Sahodaya) క్లస్టర్ల ద్వారా స్కూళ్ల మధ్య రిసోర్స్‌లను షేర్ చేసుకోవడం, హైబ్రిడ్ టీచింగ్ (Hybrid teaching) పద్ధతులను వాడుకోవడం, రిటైర్డ్ లాంగ్వేజ్ టీచర్లను లేదా సరైన అర్హతలున్న పోస్ట్ గ్రాడ్యుయేట్లను తాత్కాలికంగా నియమించుకోవడానికి బోర్డు అనుమతించింది.

Advertisement
Advertisement