Girl Dies Of Cardiac Arrest | స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటూ.. కార్డియాక్ అరెస్ట్‌తో తొమ్మిదేళ్ల బాలిక మృతి
Girl Dies Of Cardiac Arrest | రాజస్థాన్ (Rajasthan)లోని ఓ ప్రైవేటు స్కూల్లో (Rajasthan School) ఐదో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఆ చిన్నారి మృతి (Girl Dies Of Cardiac Arrest) చెందినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.
Girl Dies Of Cardiac Arrest | రాజస్థాన్ (Rajasthan)లో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బాలిక స్కూల్లో (Rajasthan School) ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఆ చిన్నారి మృతి (Girl Dies Of Cardiac Arrest) చెందినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో చోటు చేసుకుంది.
తలాన్‌పూర్‌కు చెందిన రాజేంద్ర బాపెడియా కుమార్తె దివ్య (9) గోటాన్ (Gotan)లోని ఓ ప్రైవేటు స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. ఈ నెల 23న దివ్య రోజూలానే ఉదయం 7:48కి స్కూల్‌కు వెళ్లింది. అయితే, ప్రేయర్‌కు సమయం ఉండటంతో తన ఫ్రెండ్స్‌తో కలిసి గ్రౌండ్‌కు వెళ్లింది. అక్కడ ఆడుకుంటుండగా.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాలికను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
సోదరుడు కూడా ఇలానే..
కాగా, బాలిక అన్న అభిషేక్ కూడా నాలుగు నెలల క్రితం ఇదేమాదిరి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2025, సెప్టెంబర్ 9వ తేదీన అభిషేక్ ఇంట్లో ఆడుకుంటూ స్పృహతప్పి పడిపోయినట్లు చెప్పారు. అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అభిషేక్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్లు దివ్య కుటుంబ సభ్యులు వివరించారు. నెలల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలు మరణించడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
Also Read..
అమెరికాలో సింక్‌హోల్.. గొయ్యిలో పడిపోయిన రెండు వాహనాలు.. షాకింగ్ వీడియో
మిరాకిల్.. పుట్టుకతోనే గర్భం లేదు.. కానీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు.. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం
సంబంధిత వార్తలు

NEET UG | రూ.10 లక్షలు పెట్టి పేపర్ కొంటే.. వచ్చింది 107 మార్కులే..
మే 17, 2026

NEET 2026 paper leak | నీట్ ప్రశ్నపత్రం లీక్..? అసలు పరీక్షా పత్రంతో సరిపోలిన మెటీరియల్లోని 140 ప్రశ్నలు
మే 11, 2026

Onion Capital of India | భారతదేశపు ఉల్లిగడ్డల రాజధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
మే 2, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



