త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cancer Patient | న‌ర్సింగ్ సిబ్బంది నిర్ల‌క్ష్యం.. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న మూడేండ్ల బాలుడు మృతి

Cancer Patient | క్యాన్స‌ర్‌తో (Cancer patient) బాధ‌ప‌డుతున్న ఓ బాలుడు హాస్పిట‌ల్ సిబ్బంది చేసిన పొర‌పాటుకు బ‌ల‌య్యాడు. ఇవ్వాల్సిన మందుకు బ‌దులు మ‌రో ఇంజెక్ష‌న్ ఇవ్వ‌డంతో (Formalin) అత‌డు మృతిచెందాడు.

G

National | Published On Jun 14, 2026, 8.33 am IST

Cancer Patient | న‌ర్సింగ్ సిబ్బంది నిర్ల‌క్ష్యం.. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న మూడేండ్ల బాలుడు మృతి
Advertisement

Cancer Patient | త్రినేత్ర‌.న్యూస్‌: క్యాన్స‌ర్‌తో (Cancer patient) బాధ‌ప‌డుతున్న ఓ బాలుడు హాస్పిట‌ల్ సిబ్బంది చేసిన పొర‌పాటుకు బ‌ల‌య్యాడు. ఇవ్వాల్సిన మందుకు బ‌దులు మ‌రో ఇంజెక్ష‌న్ ఇవ్వ‌డంతో (formalin) అత‌డు మృతిచెందాడు. దీంతో ఇద్ద‌రు న‌ర్సింగ్ అధికారుల‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదుచేశారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ జిల్లాకు చెందిన 3 ఏండ్ల సార్థ‌క్ యాద‌వ్ (Sarthak Yadav) బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో (Blood Cance) బాధ‌ప‌డుతున్నాడు. దీంతో త‌ల్లిదండ్రులు అత‌డిని గ‌తేడాది డిసెంబ‌ర్ 15న భోపాల్ ఎయిమ్స్‌లో (AIIMS Bhopal) చేర్చారు. అయితే డిసెంబ‌ర్ 17న అత‌ని న‌రాలు మూసుకుపోవ‌డంతో డాక్ట‌ర్లు మందులు రాశారు.దీంతో వైద్యులు సూచించిన మందుకు బ‌దులు అత‌నికి ఫార్మాలిన్ ఎక్కించ‌డంతో బాలుడు మ‌ర‌ణించాడు.

ఎఫ్ అనే అక్ష‌రం గుర్తు ఉన్న సిరంజిలోని ప‌దార్థాన్ని గుర్తించ‌కుండానే న‌ర్సింగ్ సిబ్బంది అత‌నికి ఇంజెక్ట్ చేశార‌ని ఆరోప‌ణ‌లు వెలువ‌డ్డాయి. సిరంజిలో సూచించిన మందు లేదని సార్థక్ తండ్రి సిబ్బందిని హెచ్చరించార‌ని, అయినా ప‌ట్టించుకోకుండానే మందును ఇంజెక్ట్ చేశార‌ని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది క్షణాలకే బాలుడి పరిస్థితి విషమించ‌డంతో అత‌డు స్పృహ కోల్పోయాడ‌ని, వెంటనే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించార‌న్నారు. డాక్ట‌ర్లు అతన్ని బ‌తికించడానికి ప్రయత్నించిన‌ప్ప‌టికీ మరణించాడ‌ని తెలిపారు. కుటుంబ స‌భ్యుల ఆరోప‌ణ‌ల‌తో అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.

దీంతో విషపూరిత రసాయనం ఇంజెక్ట్ చేయ‌డంతోనే బాలుడి మరణించాడ‌ని, చికిత్సా విధానాల్లో లోపాలు ఉన్నట్లు తేలింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఇద్ద‌రు న‌ర్సింగ్ అధికారుల‌పై పోలీసులు కేసు న‌మోదుచేశారు.

Advertisement
Advertisement