త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gas Leak | స‌రాక ఫ్యాక్ట‌రీలో గ్యాస్ లీక్.. ఊపిరాడ‌క ఇద్దరు కార్మికులు మృతి

Gas Leak | సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలో విషాదం చోటు చేసుకుంది. ఓ పరిశ్రమలో గ్యాస్ లీక్ అవడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. గ‌డ్డ‌పోతారం పారిశ్రామిక వాడ‌లోని సరాక ల్యాబోరేట‌రీస్‌లో (Saraca Laboratories) గ్యాస్ లీక్ అయింది.

G

Telangana | Published On Oct 23, 2026, 9.32 am IST

Gas Leak | స‌రాక ఫ్యాక్ట‌రీలో గ్యాస్ లీక్.. ఊపిరాడ‌క ఇద్దరు కార్మికులు మృతి
Advertisement

Gas Leak | త్రినేత్ర న్యూస్‌: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలో విషాదం చోటు చేసుకుంది. ఓ పరిశ్రమలో గ్యాస్ లీక్ అవడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. శుక్ర‌వారం ఉద‌యం గ‌డ్డ‌పోతారం పారిశ్రామిక వాడ‌లోని సరాక ల్యాబోరేట‌రీస్‌లోని (Saraca Laboratories) గ్లాబా బ్లాక్‌లో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో సుద‌ర్శ‌న్‌, బాలాజీ అనే ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడ‌క‌పోవ‌డంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది? గ్యాస్‌ లీకేజీకి కారణాలేంటి? అనే కోణాల్లో విచార‌ణ జ‌రుపుతున్నారు. కాగా, ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా చర్యల్లో లోపాలే గ్యాస్ లీక్ అయింద‌ని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్మికుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారిపై క‌ఠిన తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement