Ankita Sharm | చీరకట్టులో ఏకే 47 రైఫిల్‌తో కాల్పులు.. లేడీ సింగం అంకితా శర్మకు పోలీస్ శాఖ షోకాజ్ నోటీసు
Ankita Sharm | ఛత్తీస్‌గఢ్‌లో దసరా సందర్భంగా చీరకట్టులో ఏకే 47 రైఫిల్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి, రాజ్‌నంద్‌గావ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) అంకితా శర్మకు (Ankita Sharm) పోలీస్ శాఖ షోకాజ్ నోటీసు (Show-cause Notice) జారీ చేసింది.
Ankita Sharm | త్రినేత్ర న్యూస్: ఛత్తీస్‌గఢ్‌లో దసరా సందర్భంగా చీరకట్టులో ఏకే 47 రైఫిల్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి, రాజ్‌నంద్‌గావ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) అంకితా శర్మకు (Ankita Sharm) పోలీస్ శాఖ షోకాజ్ నోటీసు (Show-cause Notice) జారీ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈమేరకు చర్యలు తీసుకుంది. ఇది ఆయుధాల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించడమేనని, ఇలాంటి చర్యల వల్ల పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
లేడీ సింగంగా పేరుగాంచిన రాజ్‌నంద్‌గావ్ జిల్లా ఎస్‌పీ అంకితా శర్మ దసరా (Dussehra) సందర్భంగా (ఈనెల 20న) నిర్వహించే ఆయుధ పూజలో పోలీసు యూనిఫాంలో కాకుండా సంప్రదాయ చీరకట్టులో పాల్గొన్నారు. ఆయుధ పూజ (Shastra Puja) అనంతరం తుపాకీ (AK-47 rifle) చేతపట్టుకుని, దాని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఆమె చర్యపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా, మరికొందరు మాత్రం ఫైర్‌ఆర్మ్ సేఫ్టీ నిర్దేశిత షూటింగ్ రేంజ్ కాకుండా బయట కాల్పులు జరపడం ఎంతవరకు సమంజసం అని ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు విమర్శించడంతో పోలీస్ శాఖ ఆమెకు షోకాజ్ నోటీసు జారీచేసింది.
ఎవరీ అంకితా శర్మ?
అంకితా శర్మ ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh Police) క్లిష్టమైన ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ఆమె తన పోస్టింగ్ కాలంలో నేరస్థులు, నక్సలైట్లకు వ్యతిరేకంగా పలు కఠినమైన ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. ప్రజలతో ఆమెకున్న సత్సంబంధాలు, కఠినమైన పరిపాలనా నిర్ణయాలు ఆమెను పోలీసు శాఖలో 'లేడీ సింగం'గా నిలబెట్టాయి.
మూడో ప్రయత్నంలో
1990, జూన్ 25న ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో అంకితా శర్మ జన్మించారు. 2017 యూపీఎస్‌సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా 203వ ర్యాంకు సాధించి సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌ను పొందారు. ఆమె మూడో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు. మొదటి ప్రయత్నంలో మెయిన్స్ వరకు వెళ్లగా, రెండో ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయారు. ఖైరాఘర్ తొలి మహిళా ఎస్పీఅంకితా శర్మ తన మొదటి పోస్టింగ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని భటపారాలో చేశారు. అలాగే రాయ్‌పూర్‌లోని ఆజాద్‌చౌక్‌లో సీఎస్పీగా కూడా పనిచేశారు. 2022 మే నెలలో ఖైరాఘర్ ఎస్పీగా నియమితులై, ఆ జిల్లాకు తొలి మహిళా ఎస్పీగా రికార్డు సృష్టించారు.
During the Shastra Puja event on Vijayadashami, SP Ankita Sharma of Rajnandgaon, Chhattisgarh, handled an AK-47 rifle and performed aerial firing with it. https://t.co/NrXtosmUuG
— Treeni (@treeni) October 20, 2026
సంబంధిత వార్తలు

Shami Puja | శమీ శమయతే పాపం.. విజయాన్నిచ్చే జమ్మి పూజ!
అక్టోబర్ 20, 2026

Brother and Sister Die in Road Accident | దసరాకు చెల్లిని పుట్టింటికి తీసుకొస్తుండగా ప్రమాదం.. అన్నాచెల్లెళ్లు స్పాట్ డెడ్
అక్టోబర్ 18, 2026

Jeevan Reddy | ప్రతి ఆలయంలో జమ్మి మొక్క నాటుదాం.. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పిలుపు
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Gas Leak | సరాక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి
- ●Telangana | ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని విధానం.. తగ్గనున్న ఖర్చుల భారం!
- ●Kukatpally | దోమల నివారణకు పొగ వేస్తే.. మంటలు చెలరేగి కాలి బూడిదైన గుడిసెలు
- ●Tibet | టిబెట్‌లో భారీ భూకంపం.. 18 మంది మృతి, కూలిన 300కుపైగా ఇండ్లు
- ●ICICI Bank | ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ షాక్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్, ఉపసంహరణ చార్జీల పెంపు
- ●LIC HFL Apprentice | ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో 232 అప్రెంటిస్‌లు

Gas Leak | సరాక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి

Telangana | ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని విధానం.. తగ్గనున్న ఖర్చుల భారం!

Kukatpally | దోమల నివారణకు పొగ వేస్తే.. మంటలు చెలరేగి కాలి బూడిదైన గుడిసెలు

Tibet | టిబెట్‌లో భారీ భూకంపం.. 18 మంది మృతి, కూలిన 300కుపైగా ఇండ్లు



