త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fastest Growing Cities | ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాలు.. సత్తా చాటిన భారత్!

ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం, 2019-2035 నాటికి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే టాప్ 20 నగరాల్లో 17 మన దేశానివే. అందులో హైదరాబాద్, విజయవాడలకు కూడా చోటు దక్కింది.

J

National | Published On Mar 14, 2026, 6.34 pm IST

Fastest Growing Cities | ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాలు.. సత్తా చాటిన భారత్!
Advertisement

Fastest Growing Cities | త్రినేత్ర.న్యూస్ : భారత ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ స్థాయిలో దూసుకుపోతోంది. రాబోయే పదిహేనేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు భారతదేశం కేంద్రబిందువు కానుంది. ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ 'ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్' (Oxford Economics) విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.  2019 నుంచి 2035 మధ్య ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే టాప్ 20 నగరాల్లో ఏకంగా 17 నగరాలు మన దేశానివే కావడం భారతీయులకు గర్వకారణం.

టాప్ 10 అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు (2019–2035) ఇవే

(సగటు వార్షిక GDP వృద్ధి రేటు అంచనా ప్రకారం)

  • సూరత్ (Surat) — 9.2%
  • ఆగ్రా (Agra) — 8.6%
  • బెంగళూరు (Bengaluru) — 8.5%
  • హైదరాబాద్ (Hyderabad) — 8.2%
  • నాగ్‌పూర్ (Nagpur) — 8.4%
  • తిరుప్పూర్ (Tiruppur) — 8.3%
  • రాజ్‌కోట్ (Rajkot) — 8.3%
  • తిరుచిరాపల్లి (Tiruchirappalli) — 8.3%
  • చెన్నై (Chennai) — 8.2%
  • విజయవాడ (Vijayawada) — 8.2%

తెలుగు రాష్ట్రాల సత్తా..

ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రధాన నగరాలు చోటు దక్కించుకోవడం విశేషం. ఐటీ, ఫార్మా రంగాలతో హైదరాబాద్ (8.2 శాతం) అగ్రగామిగా ముందుకు సాగుతుండగా.. వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ ఆధారిత కేంద్రంగా విజయవాడ (8.2 శాతం) తన సత్తా చాటుతూ టాప్-10లో నిలిచింది. ఇక ఐటీ రాజధాని బెంగళూరు 8.5 శాతంతో మూడో స్థానంలో నిలిచింది.

వజ్రాలు, టెక్స్‌టైల్ వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్ అయిన గుజరాత్‌లోని సూరత్ ఏకంగా 9.2 శాతం అంచనా వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

రాబోయే రోజుల్లో ఈ నగరాలు భారీగా గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, భవిష్యత్ తరాలకు లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement